ఆటో డ్రైవర్ తో నమిత సెల్ఫీ

సెలబ్రెటీలు కనపడితే వారిని విసిగించి మరీ ఫొటోలు దిగటం ఒక రకమైన అభిమానం. కొందరు అభిమానుల చేష్టలకు సెలబ్రెటీలు విసుగెత్తిపోతుంటారు. కొత్తగా ఈ సెల్పీ కల్చర్ వచ్చిన తరువాత స్మార్ట్ ఫోన్లు పట్టుకుని సినిమా వారి వెంట పడటం కామన్ అయిపోయింది. అయితే తమిళనాడులో మాత్రం అందుకు రివర్స్ లో జరిగింది. ఒక స్టార్ హీరోయిన్ ఒక ఆటో డ్రైవర్ ని వెంబడించి మరీ సెల్ఫీ దిగింది.

సాధారణంగా సినిమా వాళ్ళు కనపడితే వారితో ఫొటోలు దిగడానికి అభిమానులు ఎగబడుతుంటారు. చాలా సందర్భాల్లో ఆ సెలబ్రెటీకి చిరాకు కూడా తెప్పిస్తుంటారు. పబ్లిక్ ఫంక్షన్ లలో, రోడ్డు మీద, షూటింగ్ ల దగ్గర అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడ పడితే అక్కడ అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అయితే తమిళనాడులో మాత్రం హాట్ హీరోయిన్ నమిత ఒక ఆటో డ్రైవర్ ని వెంబడించి మరీ సెల్ఫీ తీసుకుంది.

నమిత్ కారులో ప్రయాణం చేస్తుండగా పక్కనుండి ఒక ఆటో తన కార్ ను దాటుకొని వెళ్లింది. అయితే కారులో వెళుతున్న నమిత చూపు ఆటో డ్రైవర్ పై పడింది. ఆ ఆటో నడుపుతుంది ఒక లేడీ డ్రైవర్. ఇక అంతే నమిత ఆ ఆటోను వెంబడించి మరీ ఒక దగ్గర కారును అడ్డంగా ఆపి ఆ లేడీ ఆటో డ్రైవర్ తో సెల్ఫీ తీసుకుంది. ఈ సంఘటనకు సదరు లేడీ ఆటో డ్రైవర్ షాక్ కి గురై నోరెళ్ళబెట్టింది.

ఓ పేద కుటుంబానికి చెందిన మధ్య వయసు మహిళ కుటంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న వైనం నమితను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఆత్మవిశ్వాసానికి సెల్యూట్‌ చేసింది. అందుకే నమితతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడే చెన్నైలో నమితే ఒక లేడీ ఆటో డ్రైవర్ తో  సెల్పీ తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

Leave a Reply

Your email address will not be published.