నగ్మ రీఎంట్రీ

సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లపేరు వినగానే గుండెల్లో లావా ఉప్పొంగుతుంది. తమ అందంతో పరిశ్రమను ఉర్రూతలూగించి యువకుల హృదయాలను దోచుకున్న హీరోయిన్లు ఏవో కారణాలవల్ల తెరకు దూరమైతే ఎంతో వేదన. అలాంటి తారామణులే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటామని రెడీ అయింతే అభిమానులకు పండగే మరి.

తమ అందంతో మతులు పోగొట్టి తరువాత వేరు వేరు కారణాలతో తెరకు దూరమయ్యే అందాలతారలు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనపడతామంటే కాదనేది ఎవరు. కొన్నేళ్ళపాటు సినిమాలకు దూరంగా వుంటూ రాజకీయజీవితాన్ని గడిపిన నగ్మా మరోసారి సినిమాల్లో కి రాబోతుందట. దానికి సంబంధించిన కసరత్తులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

నగ్మ హీరోయిన్‌గా చేసే రోజుల్లో సినిమాలకంటే గాసిప్పులతోనే ఎక్కువ నానుతుండేది. అప్పట్లో ఇండియన్ క్రికెటర్ గంగూలీతో లవ్ అఫైర్ నడిపిందనే వార్తలు కూడా వచ్చాయి. ‘ప్రేమికుడు’ మూవీ చేసిన తరువాత నగ్మాకి యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అలా తెలుగు, తమిళ సినిమాలను గ్లామర్ క్వీన్‌గా ఓ దశాబ్దం ఏలింది. తరువాత కొత్త హీరోయిన్ల రాకతో ఆఫర్స్ లేక భోజ్‌పురి మూవీస్ కూడా చేసింది. అనంతరం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది నగ్మ. అయితే పాలిటిక్స్‌లో మాత్రం సక్సెస్ కాలేదు.

తెలుగులో 2001లో వచ్చిన అల్లరి రాముడు సినిమా నగ్మ చివరి మూవీ. 2002 బిజినెస్‌‌మేన్ సచిన్ జోషి సినిమా ‘నిను చూడకనేనుండలేను’ లో ఐటెం సాంగ్ చేసింది. మళ్ళీ ఇన్నాళ్ల తరువాత రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది నగ్మ. ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చిన చాలామంది సీనియర్లకు బాగానే కలిసొచ్చిన తరుణంలో నగ్మా తనకు కూడా ఈ రీఎంట్రీ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో వుందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.