‘రాజుగారి గది’కి రాబోతున్న సీక్వెల్

మన టాలీవుడ్ హీరోల్లో కొందరు రొటీన్ గా ఏమాత్రం వెరైటీ లేని రోల్స్ చేసుకుంటూ పోతారు. ఆ ట్రాక్ నుంచి బయటికి రారు. మరికొందరు హీరోలు అలా కాదు. మూస పాత్రలకు భిన్నంగా ఉండే విలక్షణమైన కేరక్టర్స్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటి నటులు నిన్నటి తరంలోనూ ఉన్నారు. నేటితరంలోనూ ఉన్నారు. అందుకు ఓ ఎగ్జాంపుల్ కింగ్ నాగార్జున.

నట కుటుంబంలో పుట్టిన నాగార్జున నటనలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తెలుగు చిత్రసీమకు రెండు కళ్లుగా భాసించిన వారిలో ఒకరైన నాగేశ్వరరావు నటించని పాత్ర లేదనే చెప్పాలి. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఒదిగిపోయిన నటుడు నటసామ్రాట్ ఏఎన్ ఆర్. ఆయన తనయుడిగా నాగార్జున కూడా ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశాడు.

నటుడిగా  నాగార్జున హీరో కేరక్టర్స్ కే పరిమితం కాలేదు. శివ సినిమా దగ్గర్నుంచి మొదలు పెడితే నాగ్ విభిన్న పాత్రలు వేస్తూనే ఉన్నాడు. కిల్లర్ వంటి యాక్షన్ పిక్చర్, గీతాంజలి వంటి రొమాంటిక్ మూవీ, నిన్నే పెళ్లాడుతా వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, హలో బ్రదర్ లాంటి స్పైసీ పిక్చర్ లో నాగార్జున చేసిన కేరక్టర్స్ ని మరచిపోలేం. ఈ పాత్రలు చేసిన నాగార్జున కెరీర్ కొన్నేళ్ల కిందట ఒక్కసారిగా టర్న్ అయింది.

అంతవరకు సాంఘిక సినిమాలు చేసిన నాగ్ అన్నమయ్య తో ఒక్కసారిగా భక్తుడి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత శ్రీరామదాసు వేసి మెప్పించాడు. భక్తుడిగానే కాదు .. .. శ్రీ షిరిడీ సాయిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు నాగ్ .. ఇంతవరకు వేయని ఓ కేరక్టర్ వేయబోతున్నాడు.  ఈమధ్య హిట్ కొట్టిన ‘రాజుగారి గది’ కి సీక్వెల్ గా తీసే మూవీలో యాక్ట్ చేయబోతున్నాడు.

‘రాజుగారి గది- 2’ పేరుతో తీసే ఈ మూవీ ఓ హారర్ థ్రిల్లర్. నాగార్జున ఈ సినిమాలో  మాంత్రికుడిగా కనిపిస్తాడట.  మాంత్రికుడంటే మనకు వెంటనే .. పాతాళభైరవి, బాలనాగమ్మ సినిమాల్లో ఎస్వీ రంగారావు నటించిన పాత్రలు  గుర్తొస్తాయి.  అయితే  నాగార్జున ఆధునిక  మాంత్రికుడిగా కనిపిస్తాడట.

Leave a Reply

Your email address will not be published.