హారర్ మూవీ చేస్తున్న నాగ్

కొంతకాలంగా టాలీవుడ్ లో హారర్ మూవీస్ చేయాలనుకుంటున్న డైరెక్టర్ల  సంఖ్య  పెరుగుతోంది. హారర్ కి కామెడీని లేదా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ని మిక్స్ చేసి సినిమా చేస్తే ఆ మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకం బలపడుతోంది. ఇలా హారర్ మూవీస్ చేయాలనుకునే వాళ్లు జనరల్ గా కుర్ర హీరోలతోనో, కొత్తవారితోనో ప్లాన్ చేస్తున్నారు. బట్ . . . ఓ సీనియర్ హీరో కూడా హారర్ మూవీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

హారర్ పిక్చర్ లో సస్పెన్స్ తో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి వర్కవుట్ అవుతుందని ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకూ టాలీవుడ్ సీనియర్ హీరోలతో  హారర్ పిక్చర్ తీయాలని  దాదాపు ఏ ప్రొడ్యూసర్ కూ ఆలోచన రాలేదనే చెప్పాలి. హారర్ మూవీ అంటే చిన్న సినిమా అని, దానికి స్టార్ హీరోస్ ఒప్పుకోరనే అభిప్రాయం ఉంది.

మెలిమెల్లిగా స్టార్ హీరోస్ కూడా హారర్ బేస్డ్ పిక్చర్స్ లో చేయాలని ఆలోచిస్తున్నారు. కింగ్ నాగార్జున అదే ఆలోచనలో ఉన్నాడట. నిజానికి నాగ్  కెరీర్ యాక్షన్ పిక్చర్ తోనే స్టార్ట్ అయింది. కానీ  నాగ్ యాక్షన్ మూవీస్ కే పరిమితం కాలేదు.  వెరైటీ మూవీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. స్టోరీలో కొత్తదనం వుంటే కనుక కొత్త దర్శకులను ఎంకరేజ్  చేస్తున్నాడు.

నాగ్ ఇప్పటికే  ఎన్నో వెరైటీ  పిక్చర్స్ చేశాడు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ఓ హారర్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడట.  ‘రాజుగారి గది’ చిత్రానికి సీక్వెల్ తీద్దామనుకొని నాగార్జునకు దర్శకుడు ఓంకార్ స్టోరీ చెప్పాడు. కథ విన్న వెంటనే ఆయన ఎంతగానో ఎగ్జయిట్ అయ్యాడట. ‘ఆ కథ విన్న దగ్గర నుంచీ నాకు నిద్ర కూడా పట్టడం లేదు’  అన్నాడట. నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ పిక్చర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.