నాగ్ చేతికి బాహుబలి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై కింగ్ నాగార్జున నమ్మకంగా ఉన్నాడు. బాహుబలి బిగినింగ్ కంటే కంక్లూజన్ మరింత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఈ మూవీపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని హక్కులను సొంతం చేసుకోవడానికి అనేక మంది పోటీపడుతున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ మన్మధుడు కూడా ఉన్నట్లు తెలిసింది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తూ 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ భారీ చిత్రానికి ఇప్పుడు సీక్వల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నేపథ్యంలో ఇప్పటికే బాహుబలి 2 బిజినెస్  కూడా సరికొత్త రికార్డ్‑లను సెట్ చేస్తోంది. దాదాపు 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌ కన్నా సెకండ్ పార్ట్‌ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు కూడా భారీ ఫైట్‌ నెలకొంది. అయితే  తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా బాహుబలి యూనిట్‑తో కలిసాడు. ప్రముఖ నిర్మాత వారాహి చలనచిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటితో కలిసి బాహుబలి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాడు నాగ్. అటు హీరోగా నటిస్తూ సొంత ప్రొడక్షన్ తో మంచి విజయాలను సాధిస్తున్న నాగ్‌ డిస్ట్రిబ్యూటర్ గాను సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నట్టు టాక్‌.

బాహబలి తొలి భాగానికి దాదాపు 7 కోట్ల వసూళ్లను సాధించిన కృష్ణ జిల్లా పంపిణీ హక్కులను నాగార్జున, సాయి కొర్రపాటి 8 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో కూడా రైట్స్ కోసం ప్రయత్నించిన నాగ్ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా హక్కులు సొంతం చేసుకోవటంతో నాగ్ ఎంట్రీ సినిమా ప్రమోషన్‑కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్ గా అడుగులేస్తున్న నాగ్‌ ఈ రంగంలో ఎంత మేరకు విజయం సాధిస్తారో చూడాలి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.