నా పాత్ర తెలుగు ధృవ లోనే బాగుంది

ధృవ సినిమా షూటింగ్ మొదలైనప్పటనుండి ఇప్పటివరకు ఏదోక హల్ చల్ చేస్తూనే వుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్స్ అమాంతం అంచనాలను పెంచేసాయి. తమిళ్ నుండి తొలుగులోకి రీమేక్ చేయబడ్డ ఈ సినిమాపై తమిళ్, తెలుగులలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి కామెంట్ చేసాడు. అరవింద్ స్వామి కామెంట్ తో టాలీవుడ్ లో మరింత కదలిక వచ్చింది.

ధృవ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.తమిళ్ తని ఒరువన్ కి రీమేక్ గా వస్తున్న ధృవ ను సురేందర్ రెడ్డి తనదైన శైలిలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో కీలకమైన విలన్ పాత్రను అరవింద్ స్వామి చేసి ఇప్పటికే అందరి మన్ననలు పొందాడు. తెలుగులోకూడా అరవింద్ స్వామే ఆ పాత్రను చేయడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అరవింద్ స్వామి ధృవ అవుట్ పుట్ చూసి షాక్ అయ్యాడట. తమిళ్ లోనే తనపాత్రకు అంత  ఎప్రిషియేషన్ రాగా ఇప్పుడు తెలుగులో తనను డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇంకా బాగా చూపించాడని అరవింద్ స్వామి కామెంట్ చేసాడట.

కొన్ని కొన్ని సీన్స్ లో తని ఒరువన్ సినిమాలో కంటే ‘ధృవ’ లోనే తనని బాగా చూపించినట్టుగా అరవింద్ స్వామి  కామెంట్ చేయడంతో అంతా ఆనందంలో వున్నారు. విలనిజం చూసిస్తూ…డైరెక్టర్ సురేందర్ రెడ్డి పెట్టిన క్లోజ్ షాట్స్ చాలా డిఫరెంట్  గా ఉన్నాయని అరవింద్ స్వామి అన్నాడు. కచ్ఛితంగా ‘ధృవ’ సినిమా తనకి తెలుగులోనూ మంచి పేరు తీసుకువస్తుందని అంటున్నాడు. అరవింద్ స్వామి మాటలతో ధృవ పై అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published.