నో రికమెండేషన్ ప్లీజ్!

కొందరు డైరెక్టర్లు ఎవరు చెప్పినా తము అనుకున్నదే చేస్తుంటారు. హీరోలు ఎటువంటి సలహాలిచ్చినా పెద్దగా పట్టించుకోరు. తమ మీద తమకున్ననమ్మకం అలా ఉంటుంది. అయితే, స్టార్ హీరోలు చెప్పే కొన్ని విషయాలను మాత్రం డైరెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. మహేష్ బాబు విషయంలో మాత్రం మురుగదాస్ పెద్దగా ఆ నియమాన్ని పెట్టుకోలేదట. మహేష్ సూచనలను తను ఖాతరు చేయడంలేదని అంటున్నారు.

స్టార్ డమ్ వచ్చిన తరువాత వారి మాట వినకపోతే కొంత అసహనం కలుగుతుంది. ఎన్నో విషయాల్లో డక్కా ముక్కీలు తిని ఈ స్టేజ్ కి వచ్చామనే ఆలోచనలో స్టార్స్ వుంటారు. అందుకే సినిమా జరుగుతున్న టైంలో డైరెక్టర్లకు కొన్ని సలహాలిస్తారు. వారిచ్చిన సలహాలను దాదాపుగా డైరెక్టర్లు ఓకే చేస్తారు. అయితే మహేష్ బాబు మురుగదాస్ విషయంలో అది జరగడం లేదట.

మహేష్ బాబు మురుగదాస్ కాంబోలో వచ్చే సినిమాలో మహేష్‌ బాబు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడు. క్రైమ్ తరహా నేపథ్యంలో నడిచే కథ కాబట్టి ఈ చిత్రంలో అత్యధికంగా యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయి. కథలో అతర్లీనంగా కొనసాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ప్రత్యేకమైన నిపుణులు అవసరం.  మహేష్‌ బాబు తనకి తెలిసిన ఓ హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్ ని మురుగదాస్ కి రికమెండ్ చేశాడు. ఆ హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్ కి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఈ మూవీకి వర్కౌట్ కాదని భావించిన మురుగదాస్ పక్కన పెట్టేసాడని అంటున్నారు.

ఈ సారి తన అంచనా తప్పదనే నమ్మకం తో మహేష్ బాబు మరో స్టంట్ మాస్టర్ ని మురుగదాస్ కి రిఫర్ చేసాడట. తనని కూడ మురుగదాస్ పక్కన పెట్టడంతో ఇంకోసారి కలగచేసుకోవడం మంచిది కాదని సైలెంట్ అయ్యాడట మహేష్ బాబు. ఆ తరువాత కొద్ది రోజులకి ఓ కొత్త స్టంట్ మాస్టర్ తో మురుగదాస్ పని చేయటం మొదలు పెట్టాడట. దీంతో మురుగదాస్ కి రికమండేషన్లు నచ్చవని అంతా అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.