నయీం పై సినిమా

గ్యాంగ్ స్టర్ నయీం పై సినిమా రాబోతుంది. ఆయన చేసిన ఆగడాలను కళ్ళకు కట్టేలా చూపించడానికి డైరెక్టర్ పక్కా స్క్రిప్ట్ రెడీ కూడా చేసుకున్నాడు. అయితే రాంగోపాల్ వర్మే ఈ చిత్రాన్ని చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. గతంలో దీనిపై మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అందరూ అనుకన్నదానికి చెక్ పెడుతూ వేరే డైరెక్టర్ ఫ్రేం లోకి వచ్చాడు.

నయీం ఎన్‌ కౌంటర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ గ్యాంగ్ స్టర్ చేసిన అరాచకాలు తవ్వుతున్నాకొద్దీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఉన్నాయి. తీగ లాగే కొద్ది డొంకంతా కదిలినట్టు ఇందులో పోలీసు, రాజకీయ ప్రముఖులు సైతం ఒక్కరి భాగోతం బయటపడుతున్నాయి. సిట్ ఇన్వెస్టిగేషన్ లో నయీం గురించి ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు చూస్తుంటే అతను ఎంతటి నరరూప రాక్షసుడో అర్ధం అవుతోంది. ఆశక్తి గొలుపుతున్న ఆ గ్యాంస్టర్ జీవితాన్ని సినిమాగా తెరకొక్కించ బోతున్నారు.

గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత నేపధ్యంతో సంచలన దర్శకుడు వర్మ మూడు పార్టులుగా సినిమా తెరకెక్కిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ప్రముఖ దర్శకుడు భరత్ నయీం జీవిత చరిత్రకు సంబంధించిన స్క్రిప్ట్‌ని రెడీ చేసుకొని మూవీని కూడా పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది. అమరావతిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

నయీం పై తీయబోయే ఈ సినిమాకు ఖయీం భాయ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమాకి ప్రముఖ రచయిత గోపి మోహన్ మాటలు అందిస్తోండగా, నయీం పాత్రను కట్టా రాంబాబు అనే నటుడు పోషిస్తున్నాడట. ఇక హీరోయిన్‌గా బెంగళూర్‌కి చెందిన మౌనిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నయీం పేరును రాంబోగా పిలవనుండగా, ఈ సినిమా ఎక్కువ భాగం అమరావతిలో జరగనుందని తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్, విశాఖపట్నంలలో చిత్రీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.