గర్జిస్తూ వస్తున్న సింగం-3

తమిళ స్టార్ హీరో సూర్య సింగం సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. ఫెరోషియస్ పోలీస్ కేరక్టర్స్ వేసి ఆడియన్స్ అభిమానం పొందాడు. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో భాగంగా సింగం- 3 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్‌ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్న చిత్ర యూనిట్‌ తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేసి మూవీపై బోలెడన్ని అంచనాలు పెంచింది.

కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో సూర్య నటిస్తోన్న సింగం- 3 కూడా ఒకటి.  ఎస్-3 పేరుతో తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో మూడో సినిమాపై కోలీవుడ్ లో బోలెడన్ని అంచనాలున్నాయి. ఈ సిరీస్ లో గత రెండు చిత్రాలు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రికార్డులు సృష్టించేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ ను కూడా దాదాపు రిలీజ్ కి రెడీ చేసేసిన సూర్య, మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశాడు.

ఇప్పటి వరకు విడుదలైన లుక్స్ తో అంచనాలు పెంచిన సింగం -3  దీపావళి స్పెషల్ గా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేసింది.  అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండానే ఎస్ -3 మోషన్ పోస్టర్ ఉందని చెప్పాలి.  సింహం వన్ టూ నెంబర్లను, ఆ తర్వాత మూడో నెంబర్ ను దాటడంతో స్టార్ట్ చేసి,  చివరకు దాని పాదాన్ని సూర్య షూ కింద మార్చేశారు. ఆ తర్వాత గ్రాఫిక్ వర్క్ తోనే తల వరకూ తీసుకొచ్చి, చివరకు మాత్రం సూర్య ఫేస్ ని సీరియస్ గా డిస్ ప్లే చేశారు.

మోషన్ పోస్టర్ లో   సూర్య మొహాన్ని సింహం గర్జిస్తున్నట్లుగా మార్చేసి   ఫినిష్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. నిజానికి ఎస్-3 చిత్రం దీపావళికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ తమ్ముడు కాష్మోరా కోసం వాయిదా వేసుకున్న సూర్య, ఈ పండక్కి ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే నవంబర్ 7న టీజర్ రిలీజ్ అంటూ సూర్య టీజ్ చేస్తున్నాడు. ఇక చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నాడు . తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న సింగం -3 చిత్రంలో అనుష్క, శృతిహాసన్ లు కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published.