రికార్డుల ‘పులి మురుగన్’

మోహన్ లాల్ దశ తిరిగింది. ఆయన కెరీర్ లో ఎన్నో హిట్స్ వున్నా ప్రస్తుతం ఆయన చూస్తున్న విజయాల ముందు చిన్నవే అవుతాయేమో. మోహన్ లాల్ ఇప్పటివరకు క్రియేట్ చేయని ఎన్నో రికార్డులను సెకెండ్ ఇన్నింగ్స్ లో క్రియేట్ చేస్తున్నాడు. రజనీకాంత్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలకంటే ముందున్నాడు మోహన్ లాల్.

మోహన్ లాల్ అంటే తెలియని సౌతిండియన్ వుండడేమో. మన దగ్గర చిరంజీవి, తమిళ్ నాడులో రజనీ కాంత్ ఎలానో మళయాళంలో మోహన్ లాల్ అంతటి స్టార్. ఆయన నటనకు అక్కడి వారే కాదు, మనం కూడా ఫిదా అయిపోయాము. అందుకు నిదర్శనమే జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలు.

మోహన్ లాల్ తన కెరీర్ తొలినాళ్ళలో కంటే సెకెండ్ ఇన్నింగ్స్ లోనే ఎక్కువ రికార్డులు సాధిస్తున్నాడని చెప్పాలి. రీసెంట్ గా ఓనం స్పెషల్ గా విడుదలైన మలయాళ చిత్రం ఒప్పం 2016లో మోహన్ లాల్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇక ఈ మూవీ తర్వాత  విడుదలైన చిత్రం పులి మురుగన్. ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పలు ఏరియాలలో ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. కొద్ది వారాల క్రితం విడుదలైన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

పులి మురుగన్ చిత్రం బాక్సీఫీస్ గురించి చెప్పుకోదగ్గ మరో విషయం, ఓవర్ సీస్ లోనూ ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలైంది. అమెరికాలోనూ, గల్ఫ్ కంట్రీల్లోనూ 630 షోలు మొదటి రోజు ఈ సినిమాకు పడ్డాయి. సల్మాన్ ఖాన్ సుల్తాన్ కు, రజనీకాంత్ కబాలికి కూడా ఈ రికార్డ్ దక్కలేదు.అంతే కాదు, పోలండ్ లో విడుదలైన తొలి మళయాళి చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

పులిమురుగన్ సినిమాను తెలుగులో ‘మన్యం పులి’ పేరుతో ప్రముఖ నిర్మాత సింధూరపు పువ్వు కృష్ణారెడ్డి నవంబర్‌లో విడుదల చేయబోతున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్  లతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గరైన మోహన్ లాల్ త్వరలో మన్యం పులి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published.