ఎన్ కౌంటర్ మృతులు 27 మంది

  • మరో మూడు మృతదేహాలు లభ్యం

మల్కాన్ గిరి (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు): ఆంధ్రప్రదేశ్ కు చెందిన గ్రే హౌండ్స్ దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27 కు పెరిగింది. మరో మూడు మృతదేహాలను పోలీసులు కనుగొన్నట్టు వార్తా సంస్థల భోగట్టా. మావోయిస్టులు సమావేశమవుతున్నట్టు సమాచారం అంది తాము జరిపిన గాలింపు చర్యల్లో మావోయిస్టులు తారసపడి తమపై కాల్పులు జరపగా ఎదురు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పిన సంగతి తెలిసినదే. సోమవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని నిన్ననే పోలీసులు చెప్పారు. మావోయిస్టు కాల్పులలో గాయపడిన గ్రే హౌండ్స్ కు చెందిన ఒక సీనియర్ కమాండో విశాఖపట్టణం, కింగ్ జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో కమాండో కూడా గాయపడ్డాడు. మరణించిన మావోయిస్టులలో అగ్రనేతలైన ఉదయ్, చలపతి కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అయితే మృతులెవరన్నది వెల్లడించడానికి సమయం పడుతుందని పోలీసులు చెప్పారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా మృతులలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎన్ కౌంటర్ ప్రదేశంలో రైఫిల్స్ ను, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.