మహేష్-మురుగదాస్ మూవీ ముచ్చట్లు

ప్రిన్స్ మహేష్ పేరు వింటే మనకు గుర్తొచ్చె చిత్రం అతడు, దూకుడు, శ్రీమంతుడు. ప్రిన్స్ నటించిన బ్రహోత్సవం సినిమా ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ దర్శకత్వంలోని ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా ఆ సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషలో తీయడానికి సన్నాహాలు జరగుతున్నాయి. తమిళంతో పాటు హిందిలో కూడా డబ్బింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకొని రెండవ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళంలో భారీ మొత్తానికి అమ్ముడు పోతుందని శ్రీమంతుడు కంటే ఎక్కవ డీల్ కుదిరందని కోలీవుడ్ లో సమాచారం.

తమిళ ఇండస్ట్రీలో మురుగుదాస్ కి ఉన్న పేరు ఈ సినిమాకి ఉపయొగ పడుతుందని అంచనా. హింది డబ్బింగ్ విషయంలో కూడా పెద్ద మొత్తంలో చర్చలు జరుగుతున్నాయట. మరో రకంగా ఆలోచిస్తే, మహేష్ కు ఉన్న సెంటిమెంట్ ప్రకారం ఒక ఫ్లాప్ తర్వాత మరో సినిమా సూపర్ హిట్ అవుతుందని ఊహాగానాలు. మహేష్ బాబు తీసిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడంతో తర్వాత వచ్చే చిత్రం హిట్ అవుతుందని అభిమానుల నమ్మకం. ఇండస్ట్రీలో సెంటిమెంట్ కి కూడా విలువ ఇస్తారన్న విషయం తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ పుట్టిన రోజు వేడుకల్ని చిత్రం యూనిట్ ఘనంగా నిర్వహించారు. వచ్చే ఏడాది సమ్మర్లో హాట్ హాట్ గా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

mahesh 1

Leave a Reply

Your email address will not be published.