మహేష్ మూవీ మెసేజ్

కొరటాల శివ తన ప్రతి సినిమా ద్వారా ఒక సందేశాన్ని ఇస్తుంటారు. ఆ సందేశం కథలో కలిసిపోయి ఆలోచింపజేస్తుంది. మిర్చి సినిమాలో ఫ్యామిలీ బాండింగ్‌ గురించి చెప్పిన కొరటాల ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాల దత్తత గురించి చెప్పాడు. ‘జనతా గ్యారేజ్’ లో పచ్చదనం, మొక్కల పెంపకం గురించి చెప్పుకొచ్చారు. ఇక ఆయన తదుపరి సినిమాలోను ఓ మెసేజ్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

రచయిత నుండి డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ వరుస సక్సెస్‌లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ప్రభాస్‌తో మిర్చి సినిమా తీసిన కొరటాల ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలు తీసి అభిమానులను అలరించాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉండేలా కథను రూపొందిస్తున్న కొరటాల రానున్న రాజుల్లో మహేష్‌తో చేయబోవు సినిమా ద్వారా కూడా ఓ మెసేజ్ ఇవ్వాలని భావిస్తున్నాడట.

ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్… పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే మెసేజ్ ఇచ్చిన కొరటాల శ్రీమంతుడు చిత్రంలో గ్రామాల దత్తతకు సంబంధించి కొన్ని డైలాగ్స్ రాసారు. ‘తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావై పోతారు’ అనే డైలాగ్ అభిమానులని ఎంతగానో అలరించింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్‌లో మొక్కల పెంపకం వాటి ఉపయోగం వివరిస్తూ ఎన్టీఆర్‌తో పవర్‌ఫుల్ డైలాగ్స్ కొరటాల చెప్పించారు.

జనతా గ్యారేజ్ లో ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి ప్రక్కన కూడా ఓ బలముంది’ అనే డైలాగ్‌తో థియేటర్‌ హోరెత్తేలా చేసింది. ఇక త్వరలో పట్టాలెక్కనున్న మహేష్ మూవీ ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’ అనే లైన్‌తో సాగుతుందని సమాచారం. మూవీ చూసిన వాళ్ళంతా ‘లవ్ యువర్ సెల్ఫ్’ అని మాట్లాడుకునేలా కొరటాల స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.