ముఖ్యమంత్రిగా మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తను చేయబోయే సినిమాను అప్పుడే లైన్లో పెట్టేశాడు. తనకు శ్రీమంతుడు లాంటి బిగెస్ట్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి టైటిల్‌ కూడా ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకోసం కొత్త రకం కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా వాడారు.

మహేష్‌, మురుగదాస్‌ కాంబో మూవీ టైటిల్ పై కొన్నాళ్ళుగా సందిగ్ధత నెలకొని ఉండగా, చిత్రానికి ఏజెంట్ శివ, అభిమన్యుడు అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో ఏది కన్ ఫాం చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఇక  మురుగదాస్ చిత్రం తర్వాత మహేష్ బాబు కొరటాల శివతో ఓ చిత్రం చేయబోతున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుండగా, ఈ మూవీకి ఏ టైటిల్ పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో శ్రీమంతుడు టైటిల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్‌, కొరటాల కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి కూడా పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోండగా, మురుగదాస్ మూవీ తరువాత మహేష్ ఈ చిత్రాన్నే చేయనున్నట్టు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.