మహేష్ బాబు తో పొలిటికల్ మూవీ తీయబోతున్న కొరటాల

హీరోలంటే నాలుగు పాటలు, ఆరు ఫైట్స్ అనే రొటీన్ కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పటికే కొన్ని వందల సినిమాలు ఆ ట్రాక్ లో వచ్చిన సంగతి తెలుసు. రొమాన్స్, ఫైట్స్ కు డిఫరెంట్ గా, నేటివిటీ ఉండే కేరక్టర్స్ అప్పుడప్పుడూ హీరోలు చేస్తుంటారు. ఒక్కోసారి చాలా అరుదుగా హీరోలు పొలిటికల్ సినిమాలు చేస్తుంటారు.  ఓ సీనియర్ హీరో పొలిటికల్ పిక్చర్  చేయవచ్చని లేటెస్ట్ టాక్.

ప్రిన్స్ మహేష్ బాబు ఈమధ్య కొంతకాలంగా డిఫరెంట్ షేడ్స్ ఉండే కేరక్టర్స్ చేస్తున్నాడు. మాస్ కు పట్టే యాక్షన్ హీరో రోల్స్ తో పాటు  సైకలాజికల్, సోషల్ ఎవేర్ నెస్ కలిగించే పాత్రలు కూడా సూపర్ స్టార్ నటిస్తున్నాడు.  అయితే ప్రిన్స్ ఇంతవరకు పూర్తి స్థాయి పొలిటికల్ పిక్చర్ చేయలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని అంటున్నారు.  మహేష్ ఇప్పుడు చేస్తున్న మురుగదాస్ పిక్చర్ తర్వాత కొరటాల శివతో చేయబోతున్నాడు.

మహేష్ బాబు ఎన్నో రకాల పాత్రలలో నటించినా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలో చేయలేదు. అంతేకాదు మహేష్ బాబుకు స్వతహాగా కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదట. అందుకే ప్రిన్స్ తన సినిమాల ఎంపికలో కూడా పొలిటికల్ మూవీస్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు ఇదివరకు ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడని లేటెస్ట్ గా ప్రచారం జరుగుతోంది.

మహేష్ – కొరటాల చేయబోయే పిక్చర్ వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుంది.  ఇది పొలిటికల్ మూవీ అని, రెండు రాష్ట్రాల సి.ఎం. లు చేసే రాజకీయాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందనీ అనుకుంటున్నారు. ఇది కరెంట్ పాలిటిక్స్ కు సంబంధించి ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు. పొలిటికల్ పిక్చర్ అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

మహేష్ బాబు కేరక్టర్ కూడా పొలిటికల్ రోల్ కాబట్టి పంచ్ డైలాగ్స్ ఉండాలి. మహేష్ బాబు, కొరటాల ఈ మూవీని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.