మహేష్ @24

కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. మహేశ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో కొరటాలతో మరో సినిమా చేయడానికి మహేశ్ ఉత్సాహాన్ని చూపించాడు. ఎంతోమంది దర్శకులు మహేశ్ ఓకే అంటే చాలని అనుకుంటున్న సమయంలో తనకి మహేశ్ మరో అవకాశం ఇవ్వడంతో కొరటాల శివ రంగంలోకి దిగిపోయాడు. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.

ఇటీవల పవన్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా, రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకోగా, కొరటాల, మహేష్‌ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం రామానాయుడు స్డూడియో టెంపుల్ లో జరిగాయి

శ్రీమంతుడు చిత్రం లాంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన మహేష్, కొరటాల కాంబో త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభానికి  కొరటాల శివతో పాటు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మహేష్ పలు కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన ఆయనకి బదులు నమ్రత ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

మహేష్‌ 24వ చిత్రంగా తెరకెక్కనున్న మూవీని జనవరిలో  సెట్స్ పైకి తీసుకెళ్ళాలని యూనిట్ భావిస్తోంది. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే కొరటాల ఇప్పటి వరకు తన సినిమాలకు టాప్ హీరోయిన్లనే సెలక్ట్ చేయగా ఈ సినిమాకు మాత్రం కొత్త హీరోయిన్ ని సెలక్ట్ చేయాలని భావిస్తున్నారట. కథ రీత్యా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నట్టు టాక్. మహేష్ 24వ చిత్రం ద్వారా కొరటాల అండ్ టీం మరో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉంది.

Leave a Reply

Your email address will not be published.