హిందీలోకి మగధీర?

2009 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించిన చిత్రం మగధీర. ఎం ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తేజ్ – కాజల్అగర్వాల్ నటించిన ఆ సంచలన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి అప్పటినుండి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకుకూడా ఆ సినిమా పట్టా లెక్కలేదు. తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఓ ప్రముఖ దర్శకుడు మగధీర రీమేక్ చేయ నున్నాడని అంటున్నారు.

కొన్నాళ్ళుగా టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారిన విషయం ఏమంటే రాజమౌళి, రామ్ చరణ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన మగధీర. రాజమౌళి టీం ఎంతో కష్టపడి ”మగధీర” సినిమాను చేశారు. ఇప్పుడు ఆ సినిమాను కొరియోగ్రాఫర్ కం దర్శకుడు తెర కెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రీమేక్ చేసే విధానంలో ఆ దర్శకుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు, నటీనటులుగా ఎవరిని ఎంపికచేస్తాడు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

చాలా రోజుల క్రితం సారీ సంవత్సరాల క్రితమే హీరో షాహిద్ కపూర్ ‘మగధీర’ బాలీవుడ్ రీమేక్ లో నటిస్తున్నాడని వార్తలొచ్చాయి. అయితే మనోడు మాత్రం అప్పట్లో నాకు అలాంటి ఉద్దేశ్యం లేదంటూ కొట్టిపారేశాడు. కాని కాలక్రమేణా అన్నీ ఫ్లాపు లొస్తున్నవేళ.. ఇతగాడి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ‘మగధీర’ హిందీ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమాను ఎవరు డైరక్ట్ చేస్తారు అనే ప్రశ్న వచ్చింది. రీమేక్ రాజా అయిన ప్రభుదేవా మగధీరని హిందీలో రీమేక్‌ చేయనున్నట్టు సమాచారం.

ప్రభుదేవ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరి, విక్రమార్కుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలను హిందీలో డైరెక్ట్ చేసి సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు మగదీర చిత్రానికి కూడా ప్రభుదేవా దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. అయితే ఇప్పటికే మగధీరకు దగ్గర్లో ఉన్న స్టోరీలైన్ తో బాలీవుడ్ లో మీర్జియా వంటి సినిమాలొచ్చాయి. అవన్నీ ఫ్లాపులే. పైగా మగధీర కూడా వాళ్లకు ఓంశాంతిఓం సినిమాను మళ్లీ చూసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఈ కథ అక్కడ ఎంతవరకు వర్కవుట్ అవుతుంది అనేదానిపై చర్చలు జరుగుతున్నట్టు టాక్.

Leave a Reply

Your email address will not be published.