ముహూర్తాలు కుదిరాయి

సినిమాల ప్రారంభాలకు, విడుదలకు ఒక్కోసారి కొన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. టైం సరిగా కుదరదు. అనుకున్నది అనుకున్నట్టు జరగదు. ఏవో ఇబ్బందులు  వస్తుంటాయి. కానీ .. అన్నింటినీ అధిగమించి చివరికి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. అందుకు ముహూర్తాలూ కుదరాలి మరి. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోస్ చిత్రాలకు లైన్ క్లియర్ అయి ముహూర్తాలు కుదిరాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నెక్స్ట్ పిక్చర్ కు కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ .. ..ఆ విరామాన్ని కవర్ చేసుకోడానికా అన్నట్టు  కొద్ది రోజుల్లోనే మూడు పిక్చర్స్ కమిటయ్యాడు. పవన్ చేస్తున్న పిక్చర్ — కాటమరాయుడు కు ఎవరు డైరెక్టరో తెలీక ఆమధ్య కొంత సస్పెన్స్ క్రియేట్ అయింది. ఎస్. జె. సూర్యతో చేద్దామని మొదట అనుకున్నా తర్వాత ఆ సినిమా  డాలీ చేతికి వచ్చింది.

పవన్ ఆ తర్వాత తమిళ డైరెక్టర్ ఆర్.టి. నీసన్ తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు పిక్చర్స్ కాక, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇంకో సినిమాకు కూడా రెడీ అయ్యాడు పవన్. శనివారంనాడు ఈ సినిమా షూటింగ్ ముహూర్తంతో  ప్రారంభమైంది. మొత్తానికి కొంత ఆలస్యం అయినా పవన్ కళ్యాణ్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ప్రిన్స్  మహేష్ బాబు విషయానికి వస్తే .. .. అతనిప్పుడు మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఉంది. దాని  తర్వాత ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్న టైంలో దానిపై ఓ క్లారిటీ వచ్చింది. మురుగదాస్ తో సినిమా తర్వాత మహేష్ బాబు కొరటాల శివతో సినిమా చేస్తాడు. ఈనెల 9న ఈ పిక్చర్ లాంచ్ అవుతుంది. డివివి దానయ్య తీసే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ – వంశీ పైడిపల్లి పిక్చర్ చేస్తాడట. 

టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల స్టార్టింగ్ కొంత లేట్ అయినప్పటికీ చివరికి ముహూర్తాలు కుదిరి లైన్ క్లియర్ కావడం, ఇద్దరూ మూడేసి సినిమాలకు కమిట్ కావడం చెప్పుకోదగ్గ విశేషం.

Leave a Reply

Your email address will not be published.