కొరటాలకు మహేష్ బాబు ఫోన్

జనతా గ్యారేజ్ మొదటిరోజు ఇండస్ట్రీలో కన్ఫూజన్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కూడా మంచి ఫామ్ లో వుండటంతో ఈ సినిమాపై అభిమానులతోపాటు ఇండస్ట్రీ కూడా భారీ అంచనాలు నొలకొల్పుకుంది. దానికి తగ్గట్టుగానే కొరటాల తన స్టైల్ మ్యాజిక్ తో సినిమాను హిట్ కొట్టాడు. ఈ సందర్భంలో కొరటాలకు మహేష్ బాబు ఫోన్ చేసి ఓ షాక్ ఇచ్చాడట. మహేష్ బాబు కొరటాలతో ఫోన్ లో ఏమన్నాడు, ఆయనిచ్చిన షాక్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో శ్రీమంతుడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరి మ్యాజిక్ మరోసారి రిపీట్ కూడా అవబోతుంది. మహేష్ బాబు గ్రాఫ్ పడిపోతున్న టైంలో కొరటాల ఒక రేంజ్ హిట్ ఇచ్చి మహేష్ బాబు ఊపిరిపీల్చుకునే లా చేసాడు. ఆ నమ్మంకంతోనే మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా అయిన వెంటనే కొరటాలతో సినిమాకు ఓకే చెప్పాడు.

మహేష్ బాబుకు కొరటాల డైరెక్షన్ పై మంచి నమ్మకుముంది. కథను క్లియర్ గా అనుకున్నది అనుకున్నట్టు చెప్పడంలో కొరటాల అందెవేసిన చేయి. ఆ విషయాన్ని మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ కూడా హిట్ కొట్టి తన ఫార్ములా సెక్సెస్ అని నిరూపించుకున్నాడు. జనతా గ్యారేజ్ సినిమా చూసి మరోసారి ఫిదా అయిన మహేష్ బాబు కొరటాల శివకు ఫోన్ చేసి కథను డీల్ చేసిన విధానం అద్భుతమంటూ పొగడ్తల్లో ముంచెత్తాడట.

మిర్చి, శ్రీమంతుడు తరువాత కొరటాల చేసిన ప్రాజెక్ట్ జనతా గ్యారేజ్. ఆ రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో అందరిని ఆకట్టుకోగా జనతా గ్యారేజ్ ఏ రకంగా వుండబోతుందని అంతా ఉత్కంఠతతో వున్నారు. వారితో పాటు జనతా గ్యారేజ్ రిజల్ట్ కోసం మహేష్ బాబు కూడా ఆసక్తిగా ఎదురు చూసాడట. అనుకున్న ప్రకారమే జనతా పాజిటివ్ రిజల్ట్ రాగానే ఆనందంతో కొరటాలకు ఫోన్ చేసి విషెష్ చెప్పాడట ప్రిన్స్.

Leave a Reply

Your email address will not be published.