కొరటాల కొత్త ప్లాన్

ప్రస్తుతం వున్న హీరోలు ఎవరూ ఒకేసారి రెండు మూడు సినిమాలను చేయడంలేదు. ఒక సినిమా పూర్తి అయ్యాకే ఇంకో సినిమాకు డేట్స్ ఇస్తున్నారు. ఈ లోపు నెక్ట్స్ ఆ హీరోతో సినిమా చేయాలనుకునే డైరెక్టర్లు పడిగాపులు కాయాల్సిందే. అలాంటి పరిస్థితి కొరటాల శివ అనుభవించాడు అందుకేనేమో మహేష్ తో చేయబోయే తరువాతి చిత్రానికి ప్రిన్స్ కి ఎప్పుడూ లేని కొత్త అలావాటుని కొరటాల చేసాడు. దీంతో వేరే డైరెక్టర్లకు పండగ చేసుకునే అవకాశం దొరుకుతుంది.

మహేష్ బాబుకి ఓ అలవాటు ఉంది. ఓ సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యేవరకూ వేరే ప్రాజెక్టును పట్టాలెక్కించడు. మహేష్ ఇప్పటివరకూ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వున్నాడు. చేస్తున్న సినిమా రిజల్ట్ తెలిసేవరకూ కనీసం కొత్త సినిమాని అనౌన్స్ చేసే అలవాటు కూడా లేదు. కానీ ఇప్పుడా ట్రెండ్ కి మహేష్ చెక్ పెట్టేస్తున్నాడు.

మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరి నాటికి పూర్తి చేసేసి, ఆ తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. అందులో ఒకటి వంశీ పైడిపల్లితో, రెండోది శ్రీమంతుడుతో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాలతో. కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ ను పరిశీలిస్తే మహేష్ లో చేంజ్ ఈజీగా అర్ధమవుతుంది. జనవరిలో 10 రోజులు, ఫిబ్రవరిలో 15 రోజులు, మార్చ్ లో 10 రోజులు చొప్పున సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చాడు. ఈ కొత్త విధానాన్ని మహేష్ కి కొరటాల అలవాటు చేయదలచుకున్నాడనుకుంటా. అందుకే నెలలో 10 రోజులు మాత్రమే మహేష్ బాబు తన సినిమాకు పనిచేసేలా కొరటాల ప్రిన్స్ డేట్స్ తీసుకున్నాడట. నెలలో పదిరోజులు మహేష్ బాబు కాంబినేషన్ లో సీన్లు చేసి మహేష్ కి వేరే సినిమా చేసుకునేలా వెసులుబాటు కొరటాల కల్పించాడు. మిగిలిన రోజుల్లో మిగతావాళ్ళకు సబంధించిన సీన్లు చేసి మొత్తంగా మహేష్ డేట్స్ ను కేవలం 40 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాలని ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్  డిసైడ్ అయ్యాడు. ఈ లెక్కన మే నెలాఖరు కల్లా సినిమా పూర్తి చేసేసి జూలై నాటికి విడుదలకు కొరటాల ప్లాన్ చేశాడట. వేగంగా ఫినిష్ చేసే ఈ ఆలోచన నచ్చడంతోనే మహేష్ ఇందుకు సై అన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.