సాంగేసుకోడానికి యూరప్

హీరో హీరోయిన్స్ లవ్ లో పడ్డాక పాటలు పాడకుండా ఊరికే ఉండరు కదా. ఆ పాడే పాటేదో మన దేశంలో కాకుండా మరో దేశంలో పాడితే బెటర్ కదా అనుకుంటారు. అందుకే .. .. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ  అన్నట్టు సాంగేసుకోడానికి సరీసరి అంటూ సరాసరి ఫారిన్ వెడుతున్నారు. అలాగే ఓ ఖైదీ కూడా పాటలకోసం యూరప్ వెడుతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, ఖైదీ నంబర్ 150 పిక్చర్ షూటింగ్ లో టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. ఇంక మూడు సాంగ్స్ మాత్రమే మిగిలాయి. ఈ మూడు సాంగ్స్ లో చిరంజీవి – కాజల్ పై రెండు పాటలు యూరప్ లో తీస్తారు. ఈ నెల 8వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే షెడ్యూల్ లో ఈ పాటల సందడి ఉంటుంది.

చిరంజీవి, కాజల్ లపై యూరప్ లో అందమైన లొకేషన్స్ లో ఈ పాటల్ని చిత్రీకరించిన తర్వాత .. .. ఈ నెల 14న మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత డిసెంబర్ లో 18న ఆడియో ఫంక్షన్  నిర్వహించనున్నారు. అన్ని హంగులతో తయారవుతున్న ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీని జనవరి 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.