బాహుబలితో ఖైదీ నంబర్ 150 ఢీ

ఇతర రంగాల్లో మాదిరే సినిమా ఫీల్డ్ లో కూడా పోటీ ఎక్కువ. కళారంగమైనా ఇక్కడ బిజినెస్ కే ప్రాధాన్యం. మిగతా బిజినెస్ ల మాదిరే ఈ రంగంలో కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల బిజినెస్ అయితే హోరా హోరీగా పోటాపోటీగా సాగుతుంది. బిజినెస్ పరంగా ఇప్పుడు అందరి కళ్లూ  రెండు పెద్ద మూవీస్ మీదే ఉన్నాయి.

భారీ చిత్రాల బిజెనెస్ ఎలా ఉంటుందా అని మూవీ ఫీల్డ్ లో అందరూ గమనిస్తుంటారు. ఈ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు… ఆడియెన్స్ లోనూ  ఎంతో  క్రేజ్ ఉంది. ప్రస్తుతం రెండు మహా బిగ్ మూవీస్ …బాహుబలి 2, ఖైదీ నంబర్ 150 చిత్రాల బిజినెస్ ఎలా ఉందన్నది అందరికీ చర్చనీయం  అయింది. ఈ రెండు సినిమాలూ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వీటి బిజినెస్ మీద రోజుకో న్యూస్ వస్తోంది.

బాహుబలి 2 బిజినెస్ గురించి రోజుకో సమాచారం అందుతోంది. అలాగే షూటింగ్ గురించి కూడా  వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  చాలా హైప్ వచ్చింది. అదేవిధంగా …మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న  ఖైదీనంబర్ 150 బిజినెస్  గురించి కూడా చాలా ఆసక్తికర సమాచారం అందుతోంది. ఖైదీ 150 మూవీ బాహుబలి బిజినెస్ ను మించిపోయిందని అంటున్నారు.

‘ఖైదీనంబర్ 150’ ఆంధ్ర హక్కులు 32 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా చరిత్రను తిరగరాసిన ‘బాహుబలి’ చిత్రం  ఆంధ్ర హక్కులతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. గతంలో ‘బాహుబలి’ ఆంధ్రా హక్కులు రూ. 30 కోట్లకు డిసైడ్ అయ్యాయి.  ఖైదీ 150 వైజాగ్ హక్కుల్ని  క్రాంతి పిక్చర్స్ రూ.7.7 కోట్లకు కొన్నదట.  అదివరకు  పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్, బాహుబలి’ వైజాగ్ హక్కులు రూ.7.2 కోట్లకు అమ్ముడయ్యాయి.

Leave a Reply

Your email address will not be published.