ఖైదీ టీజర్ అదుర్స్

రామ్ చరణ్ మూవీ ఈ రోజు ఉదయం థియేటర్లలోకి వస్తుండడంతో.. ఫ్యాన్స్ లో మెగా రచ్చ పీక్ స్టేజ్ కి చేరిపోయింది. ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150కి టీజర్ రిలీజ్ డేట్ ఇచ్చి.. మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. తన సినిమాకి ముందు ఒక్క రోజు తన తండ్రి టీజర్ ని విడుదల చేసి  మెగా  అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. అంతేకాదు తన సినిమా థియేటర్లలో తన తండ్రి మూవీ టీజర్ ని ప్రదర్శింప జేసే ఏర్పాట్లు చేసాడు.

మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత చిరు పర్ ఫార్మెన్స్ ని చూడాలనుకుంటున్న అభిమానులకు స్మాల్‌ సర్‌ ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం.   చిత్ర టీజర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని కలిగించింది. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ రిలీజ్ డేట్ తో ఇచ్చిన పోస్టరే ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చగా, ఇక తాజాగా విడుదలైన టీజర్ అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళింది.  చిరంజీవి సినిమాలో చెర్రీ కూడా స్టెప్పులేశాడనే మాటే మెగా ఫ్యాన్స్ ను ఊపేస్తుంటే.. ఇప్పుడు చెర్రీ సినిమాలో చిరు టీజర్ కూడా చూడచ్చనే అంశం.. వారి సంతోషాన్ని పతాక స్థాయికి తీసుకెళుతుంది. ఇక  తెలుగు సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్‑ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్.

మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనే ఆడియో ఈవెంట్‑కు ముహుర్తం వేదిక ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 25న ఈ సినిమా ఆడియో వేడుకను మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‑గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్‑చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తుండగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published.