కత్రినా రియల్ ఫైట్

ఏ రంగంలో అయినా నిర్లక్ష్యంగా పనిచేసేవారు కొందరుంటే, మరికొందరు పనికి అంకితమై పనిచేస్తారు. వృత్తి వాళ్లకు దైవంతో సమానం. చేసేపనిలో నాణ్యత ఉండాలని, నైపుణ్యం ఉండాలని కోరుకుంటారు. చిత్ర పరిశ్రమలో కూడా అలాంటి వర్కో హాలిక్ లున్నారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఓ సినిమాలో పాత్రలో నటించేందుకు కత్రినా ఎంత శ్రమపడుతోందో ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది.

కష్టపడి పనిచేసే వాళ్లు ఎక్కడున్నా ఆషామాషీగా పనిచేయరు. వారు దేంట్లోనూ రాజీపడరు. శ్రద్ధతో పనిచేస్తే మంచి ఫలితాలూ వస్తాయని వారి నమ్మకం. ఆ సంగతి తెలుసుకుని పాత్రకు న్యాయం చేసే నటి కత్రినాకైఫ్. ఆమె సినిమాలకోసం ట్రై చేసే రోజుల్లో ఆమె నటించడానికి పనికిరాదన్నారు. కానీ అదే కత్రినా ఇప్పుడు నటిగా మంచి పొజిషన్ లో ఉంది. అసాధ్యమనుకున్న దాన్ని పట్టుదలతో సాధించి పేరుతెచ్చుకుంది కత్రినా.

కత్రినా అంటే ఏదో గ్లామరస్ హీరోయిన్ అనే చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని  కేరక్టర్స్ చేసేటప్పుడు రిస్క్ తీసుకుంటుందని తెలీదు. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు యాక్షన్ సీన్స్ కూడా చేస్తోంది కత్రినా. ఏక్ తా టైగర్ లో కత్రినా కొన్ని రిస్కీ సీన్స్ కూడా చేసింది. కొన్ని పిక్చర్స్ లో ఫైట్ సీన్స్ లో యాక్ట్ చేసింది. బట్… అవన్నీ ఒక ఎత్తయితే… `టైగర్ జిందా హై` లో చేయబోయే ఫైట్స్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయట.

నాలుగేళ్ల క్రితం సల్మాన్‌ఖాన్, కత్రినా నటించిన ‘ఏక్ థా టైగర్’కి `టైగర్ జిందా హై` సీక్వెల్. ఇందులో రిస్కీ ఫైట్స్ ఉంటాయి. వాటిని చేయడంకోసం కత్రినా కైఫ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోబోతోంది. అంత రిస్క్ చేయడం ఎందుకు? ఆ సినిమాని వదులుకుంటే ఏం పోతుంది అని కత్రినా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు. వెనక్కి తగ్గనని, చేసి తీరాల్సిందే అని చెప్పింది. ‘ఏక్ థా టైగర్’లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ జంట మెస్మరైజ్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.