అనుష్క విషయంలో తప్పు చేశా

సినిమారంగంలో ప్రతిభ ఉన్నవారికి కూడా అవకాశాలు రావు. టాలెంట్ ఉందా లేదా అన్నది చూడకుండా– ఫలానా నటుడిపై, నటిపై లేదా మరే కళాకారుడిపైన అయినా ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునేవారున్నారు. తమకు నచ్చితే వారిలో సత్తా ఉందని, నచ్చకుంటే పనికిరాని వారనే అభిప్రాయంతో ఉంటారు. అవకాశాలు రాకుండా చేస్తారు. లేటెస్ట్ గా అలాంటి సంఘటన ఒకటి బాలీవుడ్ లో జరిగింది.

సినిమారంగంలో ఎంత ప్రతిభ ఉన్నవారైనా  అక్కడి రాజకీయాలకు ఎర అవుతూ ఉంటారు. టాలెంట్ ను అడ్డుకునేవారూ, అసలు పనికిరావు పో – అనే వారే ఎక్కువ. కానీ ఈ ఆటంకాలను  ఫేస్ చేసి, ఫీల్డ్ లో నిలబడి తమను తొక్కేయాలని చూసినవారికి  లెసన్ చెప్పిన వాళ్లూ ఉన్నారు. ఉదాహరణకు బాలీవుడ్ నటి అనుష్క శర్మనే తీసుకుందాం.

అనుష్కశర్మ విషయంలో  తనకున్న అభిప్రాయం తప్పని తేలిందని బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ అన్నాడు. ఆమెకు అవకాశాలు రాకుండా ప్రయత్నించి పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు. రబ్ నే బనాదె జోడి – మూవీ టైంలో అనుష్క శర్మ అంటే కరణ్ జోహార్ కి మంచి ఒపీనియన్ లేదట. ఆ సినిమాలో ఆదిత్య చోప్రా  అనుష్క కు అవకాశం ఇవ్వడం కరణ్ కు నచ్చలేదట. ఆమెను తీసుకోవద్దని కూడా చెప్పాడట.

కానీ నటీనటుల్లో టాలెంట్ ఉంటే యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ  వారికి వరసగా మూడు సినిమాల్లో ఛాన్సిస్తుంది. ఆ సంస్థ తీసిన రబ్ నే బనాదె జోడి సినిమాలో అనుష్క శర్మ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమా చూసిన తర్వాత కరణ్ జోహార్ అభిప్రాయం మారింది. అందులో అనుష్క శర్మ  నటన చూశాక — ఒక మంచి నటి కెరీర్ కు అడ్డు పడ్డానే అని బాధ పడ్డాడట.

Leave a Reply

Your email address will not be published.