ఐటం సాంగ్ తో ఙ్ఞానోదయం

టాలీవుడ్ లో హీరోయిన్లు ఐటం సాంగ్ చేయడమనేది చాలా అరుదు. మన దగ్గర ఈ స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేస్తే ఐటం అనే ముద్రవేసేస్తారు. స్పెష్ సాంగ్ చేసిన వారిపట్ల ఒక చులకన భావం ఏర్పడే అవకాశం కూడా వుంది. రీసెంట్ గా జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్ ఐటం సాంగ్ చేసి చాలా ఇబ్బందులకు గురవుతుందట. ఐటం సాంగ్ అంటే హీరోయిన్లు ఎందుకు దూరంగా వుంటారనేది అర్ధమయిందని కాజల్ అంటుంది.

సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి మంచి డిమాండ్ వుంటుంది. మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించడంలో ఐటం సాంగ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సాంగ్ కోసం వాడే సాహిత్యం కూడా ప్రేక్షకులను ఊహాలోకాల్లోకి తీసుకువెళుతుంటుంది.

ఒక హీరోయిన్ ఐటంసాంగ్ చేసిందంటే ఇక్కడి ప్రేక్షకుల లెక్కల ప్రకారం ఆ హీరోయిన్ పనైపోయిందని అర్ధం చేసుకుంటారు. అవకాశాలు లేకపోవడం వల్లే ఆ హీరోయిన్ ఐటం సాంగ్ చేసిందని అనే అంచనాకు వచ్చేస్తారు. బాలీవుడ్ పరిస్థితి అదికాదు. టాప్ హీరోయిన్లు కూడా ఐటం సాంగ్స్ చేస్తుంటారు అది వారి కెరీర్ కి ప్లస్ గానే మారుతుంది. రీసెంట్ కాజల్ అగర్వాల్ జనతా గ్యారేజ్ లో స్పెషల్ సాంగ్ చేసి నానా అవస్తలు పడుతుందట.ఇక మీదట చచ్చినా ఐటం సాంగ్ చేయనని కాజల్ కూర్చుందట.

జనతా గ్యారేజ్ తరువాత కాజల్ కు ఆఫర్లు బాగా పెరిగిపోయాయి.అయితే అవి హీరోయిన్ ఆఫర్స్ కాదు, ఐటం సాంగ్ ఆఫర్స్. వచ్చిన నాలుగైదు ఫోన్ కాల్స్ లో రెండు మూడు స్పెషల్ సాంగ్ చేస్తారా అనే వే వున్నాయట. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలనుండి బాగా ఫోన్స్ వస్తున్నాయని అంటుంది. ఈ దెబ్బతో కాజల్ కి దిమ్మతిరిగి ఇక మీదట ఐటం సాంగ్ చేయనని తెగేసి చెప్పేసింది.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కోసం ఆ సాంగ్ చేసానని ఇక ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా ఐటం సాంగ్ చేసేది లేదని కాజల్ తెగేసి చెప్పిందట.

Leave a Reply

Your email address will not be published.