పూరీతో సినిమాపై జూనియర్ సెకండ్ ధాట్

హీరోల చూపు ఎప్పుడూ లాంగ్ కెరీర్ మీదే ఉంటుంది. హీరోగా చాలాకాలం ఉండాలంటే  ఎప్పుడూ సక్సెస్ లోనే ఉండాలి. అలా వరస హిట్లతో వర్థిల్లితేనే లాంగ్ స్టాండింగ్ లో ఉండగలరు. కాబట్టి హీరోలు హిట్స్ పైనే ఫోకస్ పెడతారు. హిట్ కావాలంటే హిట్ డైరెక్టర్ ఉండాలి. ఏ డైరెక్టర్ తో చేయాలన్నా హీరోలు ముందుగా వారి విజయాలనే చూస్తారు. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. 

కొంతకాలం నుంచీ చెప్పుకోదగ్గ సక్సెస్ లు లేక నిరాశ పడిన జూనియర్ ఈ ఏడాది వరసగా రెండు హిట్లు కొట్టాడు. ఈ ఇయర్ బిగినింగ్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో…. స్టడీ రన్ అయి హిట్ అయితే… రెండో సినిమా జనతా గ్యారేజ్ ఒక తుఫానులా వచ్చి సక్సెస్ సాధించింది.

ఈ రెండు వరస హిట్ల తర్వాత యంగ్ టైగర్ తర్వాత చేయబోయే సినిమా గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడట. తను చేయబోయే పిక్చర్ జనతా  గ్యారేజ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకూడదని, ఇంకా హై లో ఉండాలని అనుకుంటున్నాడు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. బిగ్ హిట్ కొట్టాలంటే  సక్సెస్ డైరెక్టర్ని పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు.

ఇప్పుడు జూనియర్ దృష్టిలో వివి వినాయక్, బోయపాటి, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ ఉన్నారు. అయితే మొదటి ముగ్గురూ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ గా ఉన్నారు. కాబట్టి పూరీ జగన్నాథ్ తో చేయాలనుకుంటున్నాడట. కానీ పూరీ చేసిన ఇజం సినిమాపై మిక్స్ డ్ టాక్ వచ్చింది. సక్సెస్ అని ఎవరూ చెప్పడం లేదు. అందుకే పూరీతో చేయాలా వద్దా అని జూనియర్ కాస్త తటపటాయిస్తున్నట్టు తెలుస్తోంది.

పూరీపై ఎన్టీఆర్ కి కాన్ఫిడెన్స్ ఉంది కానీ…ఇజం రిజల్ట్ తోనే మళ్లీ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. ఈ నలుగురు స్టార్ డైరెక్టర్లూ కాక మరో డైరెక్టర్ తో చేస్తాడా అని కూడా అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.