రంభ మెచ్చిన డ్యాన్సర్

మన హీరోల్లో కొందరు నటనలో పర్ఫెక్ట్ అయితే, మరికొందరు డాన్స్ లో ఎక్స్ పర్ట్స్. రెండింటిలోనూ  టాలెంట్ ఉన్నవారూ ఉన్నారు. అలాంటివారు ఎలాంటి పిక్చర్ కైనా సూటవుతారు. నందమూరి వంశం వారసుడు జూనియర్ ఎన్టీఆర్  నటనలోనూ, డాన్స్ లోనూ దిట్ట. నిన్నటిదాకా హీరోయిన్ గా వెలిగిన ఓ ముద్దుగుమ్మఅతని డాన్సింగ్ చూసి .. . ముచ్చటపడి మెచ్చుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడు మాత్రమే కాదు .. టాలెంటెడ్ డాన్సర్ కూడా. డాన్స్ లో అతని స్పీడ్ చూసి హీరోయిన్స్ కూడా వండర్ అవుతారు. యంగ్ టైగర్ కు  డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం. డాన్స్ చేసేటప్పుడు శరీరాన్ని ఎలాగైనా వంపులు తిప్పే స్కిల్ అందరికీ రాదు. కానీ జూనియర్ కు ఆ నైపుణ్యం ఉంది.

ఎన్టీఆర్ డాన్స్ ను ఇప్పటికే ఎందరో మెచ్చుకున్నారు. నిన్నటి హీరోయిన్ రంభ కూడా  జూనియర్ డాన్స్ చూసి ఫిదా అయిపోయిందట . ఈ జనరేషన్  హీరోల్లో డ్యాన్స్  పరంగా ఎన్టీఆరే తన ఫేవరెట్  అని అద్భుతంగా డాన్స్ చేస్తాడని  అంది. ‘యమదొంగ’లో అతనితో తను చేసిన .. .. నాచోరే పాట చాలా స్పెషల్ సాంగ్ అని, పాటలో చాలా కష్టమైన స్టెప్స్ ఉంటాయని  రంభ  చెప్పింది.

“నాచోరే పాటలో  ఆ మూమెంట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ కాలికి పెద్ద గాయమైంది. విపరీతంగా రక్తం కారింది. అయినా అతను డ్యాన్స్ ఆపలేదు. బాధను అణచుకుని డ్యాన్స్ కంటిన్యూ చేశాడు. అతడి కమిట్మెంట్ అద్భుతం. పెర్ఫామెన్స్ పరంగానూ ఎన్టీఆర్ నాకు చాలా నచ్చుతాడు’’ అని రంభ తెలిపింది. ఒకప్పుడు చిరంజీవితో ఈక్వెల్ గా డాన్స్ చేసి అదరగొట్టిన  రంభ ఎన్టీఆర్ ను మెచ్చుకోవడం విశేషం. ఇంతకుముందు రమ్యకృష్ణ కూడా ‘సింహాద్రి’లోని పాటకు ఎన్టీఆర్ చేసిన డాన్స్ ను మెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published.