జ్యో అచ్యుతానంద రివ్యూ

నారారోహిత్, నాగ శౌర్య, రెజినా ప్రధాన పాత్రలుగా నటించిన జ్యో అచ్యుతానంద చిత్రం శుక్రవారం విడుదలయింది. `ఊహలు గుసగుసలాడే` సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన దర్శకుడు `అవసరాల శ్రీనివాస్` ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి లిరిక్స్ `భాస్కరభట్ల` అందించారు. `వారాహి చలన చిత్రం` బ్యానరుపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు `కళ్యాణి మాలిక్` ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

ఇక కథ విషయానికి వస్తే, ఇదో అన్నదమ్ముల కథగా మనం చెప్పుకోవాలి. అన్నదమ్ముల మధ్య చిలిపి తగాదాలు, చిరు గోడవల నేపథ్యంలో ఈ చిత్రాన్ని హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో ఆద్యంతం నవ్వించారు. ఈ చిత్రంలో నారా రోహిత్ అచ్యుత్ రామయ్యగా, నాగ శౌర్య ఆనంద్ వర్ధమాన్ రావ్ గా, రెజినా జ్యోత్స్న అనే పేర్లతో నటించారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేసే అచ్యుత రామయ్య, మెడికల్ రిప్రజెంటేటీవ్ గా పనిచేసే ఆనంద్ వర్ధమాన్ రావ్ లు అన్నదమ్ములు. ఇద్దరూ అన్ని విషయాలలో ఒకేలా కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ఉంటున్న ఇంటి పక్కకు జ్యోత్స్న (రెజినా) అద్దెకు దిగుతుంది. అన్నదమ్ములిద్దరూ ఒకిరికి ఒకరు తెలియకుండా జ్యోత్స్న మీద ప్రేమపెంచుకుంటారు. ఈ విషయాన్ని వారు జ్యోత్స్నకు చెబుతారు. కానీ ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రండ్ ఉన్నాడని ఇద్దరికి సారీ చెబుతుంది. ఈ విషయం జ్యోత్స్న చెప్పడంతో అచ్యుత్ ఆవేశానికి గురవుతాడు. ఆ ఆవేశంలో జ్యోత్స్న పాస్ పోర్ట్ ను అచ్యుత్ కాల్చేస్తాడు. తన పాస్ పోర్ట్ ను కాల్చాడని జ్యోత్స్న అచ్యుత్ పై కోపంతో రగిలిపోతుంది. ఈ విషయాన్ని వారి తండ్రికి చెబుతానని జ్యోత్స్న అచ్యుత్ ని బెదిరిస్తుంది.

ఇంతలో అచ్యుత్, ఆనంద్ తండ్రికి గుండెపోటు వస్తుంది. తమ సంగతి తండ్రికి చెప్పడంవల్లే గుండెపోటు వచ్చిందని అచ్యుత్, ఆనంద్ లు జ్యోత్స్నతో గొడవకు దిగుతారు. ఈ గొడవ కారణంగా జ్యోత్స్న అమెరికాకు వెళ్లిపోతుంది. కొంతకాలం తర్వాత జ్యోత్స్న ఇండియాకు తిరిగివస్తుంది. ఈలోగా అన్నదమ్ములిద్దరికి వివాహాలు అవుతాయి. వీరి భార్యల దగ్గర జ్యోత్స్న ప్రస్తావన వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? జ్యోత్స్న తిరిగిరావండంతో వాళ్లల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకున్నాయి? ఎవరి జీవితాలు ఏ మలుపు తిరిగాయి? శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా? తెలుసుకోవాలంటే జ్యో అచ్చుతానంద చిత్రం చూసి తీరాల్సిందే.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.