జనతా గ్యారేజ్ కలెక్షన్ల సునామీ

  • 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెడుతున్న జూనియర్ మూవీ

ఒక్కోసారి కొన్ని సినిమాలు సుడిగాలిలా వచ్చేస్తాయి. ఒక ప్రభంజనంలా జనాన్ని చుట్టుముడతాయి. ఎక్కడ విన్నా ఆ సినిమా గురించే వినిపిస్తుంది. అందరూ ఆ మూవీ గురించే చెప్పుకుంటారు. ఆ పిక్చర్ అందరికీ ఓ సెన్సేషన్ అవుతుంది. గత ఏడాది బాహుబలి అలాంటి సంచలనం సృష్టించింది.  ఈ ఏడాది అలా  ప్రభంజనాన్ని రేపుతున్న సినిమా జనతాగ్యారేజ్. కలెక్షన్స్ లో పాత రికార్డుల్ని ఓవర్ టేక్ చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ జనానికి  బాగా పట్టేసింది. రిలీజైన మొదటి రోజు నార్మల్ అని టాక్ వచ్చినా, ఆ తర్వాత రోజురోజుకీ అదరగొడుతోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  రెండవరోజు నుంచే ఈ పిక్చర్ పికప్ అయిందంటున్నారు. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ని మించిపోయేలా కలెక్షన్స్ వచ్చాయి.  మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.32 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటున్నారు.

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిన మూవీగా జనతాగ్యారేజ్ స్టాండ్ అయింది.  ఈ పిక్చర్ కు ఒక పాయింట్ బాగా కలిసొచ్చింది. విడుదలైన రోజు నుంచి సెలవులు  రావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. బుధవారం నాటికి ఈ సినిమా రిలీజై  20 రోజులైంది. ఈ 20 రోజుల్లో జూనియర్ మూవీ అదివరకటి మగధీర, అత్తారింటికి దారేది మూవీస్ కలెక్షన్స్ ను బీట్ చేసింది. రిలీజైన కొన్ని రోజులదాకా  4వ స్థానంలో ఉంది.

యంగ్ టైగర్ మూవీ రిలీజైన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటిదాకా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు కలెక్షన్స్ నే రికార్డుగా తీసుకుంటున్నారు. ఆ మూవీ ఇదే టైంలో 86 కోట్లు వసూలు చేసింది. జూనియర్ మూవీ ఇక కొద్ది రోజుల్లో అది కూడా అధిగమించి, 100 కోట్ల క్లబ్ లో చేరడం తప్పదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.