జాకీచాన్ కి గౌరవ ఆస్కార్

ప్రముఖ యాక్షన్‌ హీరో జాకీచాన్‌కు గౌరవ ఆస్కార్‌ పురస్కారం లభించింది. లాస్‌ఏంజెలిస్ లో జరిగిన వార్షిక గవర్నర్స్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు, ఆయన సాధించిన విజయాలకు గాను గౌరవ ఆస్కార్ ను అందించాలని ఆస్కార్ జ్యూరీ నిర్ణయించింది.

ఈ అవార్డు తనకు చాలా ఆనందాన్నిచ్చిందని జాకీచాన్ అన్నాడు. తను సినీ ప్రరిశ్రమకు  చేసిన సేవకు తగిన గుర్తింపుగా భావిస్తున్నట్టు జాకీ తెలిపాడు.

ఇప్పటివరకు ఆయన ఆస్కార్ పురస్కారం అందుకోలేదు. ఆగస్ట్ లో అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీల జాబితాలో జాకీ చాన్ రెండో స్థానంలో నిలిచాడు. హాంకాంగ్ లో పుట్టిన జాకీచాన్ ఎనిమిదేళ్ల వయసులో నటనా రంగంలో అడుగుపెట్టి ముప్పైకి పైగా మార్షల్ ఆర్ట్స్ ప్రధాన చిత్రాల్లో నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులు వున్నారు.  ఆయనకు ఇప్పటి వరకు ఆస్కార్ మాత్రం అందలేదు.

ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎడిటర్ అన్నే.వి.కోట్స్, కాస్టింగ్ డెరెక్టర్ లిన్ స్టాల్మాస్టర్, ప్రెడ్రిక్ వైస్మెన్లకు కూడా గౌరవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖులు ఎమ్మాస్టోన్, నికోల్ కిడ్మన్, దేవ్పటేల్ తదితరుల హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published.