Indian Army Destroys Pakistan Posts Across LOC

Indian army carried out bombing of terrorist camps along the Line of Control in Kashmir sector in May 21-22 to warn Pakistan not to encourage infiltration of terrorists.

New Delhi: In a targeted operation by Indian Army at the Line Of Control, several Pakistani posts were attacked at Naushera sector of Kashmir according to Indian Army Spokesperson Major Ashok Narula.

As attempts of infiltration will go up in near future due to snow Indian army took this pro-active operation.
Dramatic videos were released by Army which show heavy firing on Pakistani posts.

This is a clear signal by Indian army to the world that makes it clear that if Pakistan tries to push infiltration, India will take firm, severe action.

This is different from surgical strikes as Indian army fired mortars from border unlike surgical strike which include bunker busting and anti-tank guided munitions.

Two soldiers were mutilated and a young Kashmiri officer was brutally killed by terrorists recently and this action clearly sends a warning to neighbouring country that India won’t tolerate for too long if such incidents are repeated.

Leave a Reply

Your email address will not be published.

Modi celebrates Diwali with Jawans

  • Says OROP was his dream project

Kinnaur (HP): Prime Minister Narendra Modi celebrated Diwali with Indian army jawans and ITBP personnel at Sumdo, Kinnaur district of Himachal Pradesh, which is over 270 kms away from Himachal Pradesh capital Shimla. Jawans raised slogans ‘Bharat Mata ki Jai’ and ‘Vande Mataram’ along with Modi.

Modi said that after becoming the Prime Minister, in his first public meeting, he invited ex-servicemen in Rewari and promised One Rank One Pension (OROP). It is not just about Rs 200 cr or Rs 500 cr, but a sum of Rs 10,000 cr to be paid by the government in one go, which made the entire government officials lose sleep over it.  Modi has requested the ex-servicemen to accept the amount in four installments. So far, Rs 5,500 crore has been paid as part of the first installment.

The prime minister said OROP scheme has been pending for 40 years, as certain people in the previous government did not understand the scheme and allotted only Rs 500 cr for the purpose.  He added that the previous officials thought that a section of ex-servicemen would turn against the government if the scheme was not implemented. He tweeted, “Spent time with our courageous ITBP officials & Army Jawans at Sumdo, Kinnaur district, Himachal Pradesh. Jai Jawan! Jai Hind!,”

Modi on his way to Sumdo made an unscheduled halt at Chango village to meet civilians and convey Diwali wishes to them. He said that he was deeply touched by the reception by the villagers at Chango.

Leave a Reply

Your email address will not be published.

ఈ దీపావళి సైనికులకు అంకితం

  • మన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోడి

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి రోజున ఉదయం మన్ కీ బాత్ పేరుతో తను నెల నెలా ప్రజలకు ఇచ్చే వీడియో సందేశం ఇచ్చారు. ఈ ఏడాది దీపావళిని తాను సైనిక దళాలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. దీపావళి రోజును సైనికుల మధ్య గడపడానికి ఆయన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లారు. ఇంతకు ముందు కూడా ఆయన దీపావళిని సైనికుల మధ్య జరుపుకున్నారు.

“మేము ప్రశాంతంగా నిద్ర పొగలుగుతున్నామంటే మీరు సరిహద్దులను కాపలా కాస్తున్నారు కనుకే” నని ప్రధాని తన సందేశంలో సైనికులను ఉద్దేశించి అన్నారు. పర్వతాలమీద నిర్మానుష్య ప్రదేశాలలో సైతం సైనికులు మన కోసం కాపలా కాస్తున్నారనీ, కొందరు మన పరిశ్రమలకు, కొందరు మన విమానాశ్రయాలకు రక్షణగా నిలబడ్డారని అన్నారు.

బీ ఎస్ ఎఫ్ (సరిహద్దు భద్రతాదళం), సీ ఆర్ పీ ఎఫ్(కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం), అస్సాం రైఫిల్స్ , ఐ టి బి పి(ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు), నౌకాదళం, వైమానిక దళం, జవానులు మన భద్రత పట్ల నిరంతర అప్రమత్తతతో ఉన్నారనీ, అందుకే మనం ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నామనీ ప్రధాని అన్నారు. పిల్లలు సైతం మన సైనిక దళాలను గౌరవించి, ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు.

గత నెలలో సర్జికల్ దాడులు జరిగిన తర్వాత ప్రధాని మూడు నిమిషాల వీడియో విజ్ఞప్తిని విడుదల చేశారు. దేశంలో వివిధాప్రాంతాలలో విధి నిర్వహణ చేసే సైనికులకు తన పేరిట ఏర్పాటు చేసిన వెబ్ సైట్ కు  దీపావళి శుభాకాంక్షలు పంపవలసిందిగా అందులో ఆయన ప్రజలను కోరారు. ఇది విజయవంతమైందనీ ఎందరో సైనిక దళాలకు శుభాకాంక్ష సందేశాలు పంపించారని ప్రధాని తెలిపారు. #sandesh2soldiers కు ప్రజలు ట్వీట్ చేసిన సందేశాలను ప్రధాని రీ ట్వీట్ చేశారు.

అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, సింగర్ కైలాష్ ఖేర్, పలువురు రాజకీయనాయకులు శుభాకాంక్షలు పంపినవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

ప్రతీకారం తీర్చుకుంటాం

  • భారత సైనికుని చంపి, శిరచ్ఛేదం చేసిన పాక్ చర్యపై భారత సైన్యం హెచ్చరిక
  • 15 మంది పాక్ రేంజర్ల వధ అబద్ధమని పాకిస్తాన్ బుకాయింపు
  • సరిహద్దులలో భారత్ పౌరులపై కొనసాగుతున్న పాక్ దాడులు

జమ్ము: జమ్ము-కాశ్మీర్ లోని ఆధీన రేఖకు దగ్గరలో, కుప్వారా జిల్లాలోని మచ్చీల్ సెక్టార్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులు ఒక భారత సైనికుని హతమార్చి మృతదేహం శిరస్సును నరికి ఆటవికతను ప్రదర్శించారని సైన్యం చెప్పింది. “ఇందుకు తగిన జవాబు” చెబుతామని పాకిస్తాన్ ను హెచ్చరించింది.

ఈ హేయమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైనిక కేంద్రాలనుంచి జరిపిన కాల్పుల మాటున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి పారిపోయారని, ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భారత సైన్యం హతమార్చిందనీ ఉధంపూర్ లోని నార్తరన్ కమాండ్ ముఖ్యకార్యాలయం నుంచి జారీ చేసిన ఇక ప్రకటనలో సైన్యం తెలిపింది. “దీనికి ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటా”మని స్పష్టం చేసింది.

అక్టోబర్ 21న జరిగిన ఒక దాడిలో సరిహద్దు భద్రతా దళం(బీ ఎస్ ఎఫ్)జవాన్ గుర్నామ్ సింగ్ గాయపడి మరునాడు మరణించిన తర్వాత అందుకు ప్రతీకారంగా తాము జరిపిన కాల్పుల్లో 15 మంది పాకిస్తానీ రేంజర్లు మరణించినట్టు బీ ఎస్ ఎఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, సరిహద్దుల వద్ద జరిగిన కాల్పుల్లో తమ జవాన్లు ఎవరూ మరణించలేదని పాకిస్తాన్ బుకాయించింది.

అది అలా ఉండగా, జమ్ము, పూంచ్ జిల్లాలలో సరిహద్దుల వద్ద శుక్రవారం పాక్ దళాలు జరిపిన మోర్టార్ దాడిలో ఒక మహిళతో సహా ఇద్దరు పౌరులు మరణించారు. జమ్ము ప్రాంతంలోని కతువా జిల్లాలో ఒక బాలిక, ఇద్దరు మహిళలతో సహా నలుగురు గాయపడ్డారు.

గురువారం, ఆర్.ఎస్. పురా సెక్టార్ లో అబ్దుల్లియన్ అనే చోట జరిగిన కాల్పుల్లో జితేందర్ సింగ్ అనే బీ ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ చనిపోయాడు. ఆయనకు నివాళి అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీ ఎస్ ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్, తాము ఇంతవరకు 15 మంది పాకిస్తానీ రేంజర్లను చంపామని చెప్పారు. ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించడానికి వారు చేసిన ప్రయత్నాలను రెండుసార్లు భగ్నం చేశామన్నారు. బీ ఎస్ ఎఫ్ జరిపిన ప్రతీకార దాడుల్లో అరడజను వరకూ పాకిస్తానీ సైనిక కేంద్రాలు దెబ్బతిన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

Leave a Reply

Your email address will not be published.

ప్రజలకు తెలియక్కర్లేదు

  • సర్జికల్ దాడులపై మాజీ ఎన్ ఎస్ ఏ శివ శంకర్ మీనన్
  • అసలు సర్జికల్ అనడమే సరికాదని వ్యాఖ్య
  • గతంలో గుప్తంగా ఉంచడం వల్లనే పాక్ దూకుడు తగ్గేదని వివరణ

న్యూ ఢిల్లీ: గత నెల 28వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో భారత సైన్యం జరిపిన దాడుల గురించి మోడీ ప్రభుత్వం బహిర్గతం చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంలో జాతీయభద్రతా సలహా దారుగా ఉన్న శివశంకర్ మీనన్ దానిపై గళం విప్పారు. దేశప్రజలు తెలుసుకోడానికి ఉద్దేశించినవి కావు కనుక యూపీఏ హయాంలో జరిగిన ఇలాంటి దాడులను బహిర్గతం చేయదలచుకోలేదని ఆయన చెప్పారు. ఆ దాడుల లక్ష్యం వేరనీ, కనుక (2011లో జరిగిన జింజర్ ఆపరేషన్ లాంటి) వాటిని బయటపెట్టనందుకు తను విచారించడం లేదని అన్నారు.

భారతసైన్యం పీఓకేలో జరిపిన దాడులను సర్జికల్ దాడులు అనడం కూడా సరికాదనీ, ఆ మాట ప్రచ్చన్న యుద్ధ కాలానికి చెందిందనీ, శత్రు దేశపు నాయకులను అంతమొందించిన సందర్భంలో ఆ మాట వాడేవారనీ ఆయన అన్నారు. మనం ఇప్పుడు జరుపుతున్నవి సరిహద్దుల్లో శాంతిని కాపాడడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక గుప్త చర్యలని వివరించారు.

ఇలాంటి గుప్త చర్యల ఉద్దేశం సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పడం , ఉగ్రవాదుల చొరబాటును, కాల్పుల విరమణ ఉల్లంఘనలను నివారించడమే తప్ప దేశంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి కాదని ది హిందూ పత్రికకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ మీనన్ అన్నారు. ఈ దాడుల గురించి బయటపెట్టకుండా గుప్తంగా ఉంచడం వల్ల పాకిస్తాన్ దూకుడు తగ్గించిందనీ, అందువల్ల తాత్కాలికంగా నైనా శాంతి నెలకొనే అవకాశం కలిగిందనీ ఆయన చెప్పారు. సర్జికల్ దాడులు జరిపిన సంగతిని మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ రణబీర్ సింగ్  మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసినదే.

Leave a Reply

Your email address will not be published.

Militants and armed forces in standoff at Pampore EDI

Srinagar: Indian Intelligence agencies’ warning that Pak-based militants would strike back over the recent surgical strikes came true earlier than expected. On Monday morning, two to four militants were found to have been holed up in Entrepreneurship Development Institute (EDI) in Pampore, just 15km from Srinagar.

The massive complex, sitting on the edge of Jhelum River, faces the Jammu-Srinagar highway and it is suspected that the militants had got into the institute from the river side as the highway is heavily secured. According to sources, the militants had been waiting at EDI for an opportunity to slip into Srinagar.

With security forces ringing the complex, it is a standoff between a handful of gunmen and Indian forces. No gunfire has been reported but fire was seen emanating from a wing of EDI in the morning. It is thought the fire was deliberately started by militants to divert security forces’ attention.

Ironically, the same complex was the target of militants in February this year. In that encounter, three militants were killed in a running battle with Indian armed forces. The operation that lasted nearly three days, was launched after gunmen attacked a CRPF convoy that resulted in six casualties on Indian side and took refuge in EDI building.

Leave a Reply

Your email address will not be published.

దాడి ఇలా జరిగింది…

  • అడవులు, పర్వతాలు, ఎత్తు పల్లాలు…ఆపైన అర్థరాత్రి
  • పకడ్బందీగా వ్యూహరచన
  • కెమెరాలో భద్రంగా మొత్తం ఆపరేషన్

న్యూ ఢిల్లీ: అది అడవులు, పర్వతాలతో నిండిన ప్రాంతం. ఎత్తు పల్లాలతో ఉంటుంది. అర్థ రాత్రి. అందులోనూ శత్రుభూమి, గుప్త చర్య. ఎక్కడ ఏ మందుపాతర పేలుతుందో, ఏ వైపు నుంచి కాల్పులు విరుచుకు పడతాయో, ఎక్కడ మరే ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. అలాంటి చోటికి వెళ్లడానికి భారత సైనికులు సమకట్టారు. ముందే రెకీ జరిపి  వ్యూహరచన చేసుకున్నారు. అత్యాధునిక సాంకేతిక సంపదను ఒడుపుగా సిద్ధం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచే దాడి చేయబోయే ప్రాంతం వైపు సాగారు. ఎండుటాకు చిటుక్కుమన్నా వినిపించే టంత నిశ్శబ్దం పాటించారు. పాక్ సైనికుల దృష్టిని ఆవైపు మళ్లించడానికి ఉరీ ప్రాంతంలో భారీ ఎత్తున కాల్పులు జరిపించారు.  పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగంలోకి రెండు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లారు.

ఉగ్రవాదులకు చెందిన 7 లాంచింగ్ ప్యాడ్ లను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 4.30కు క్షేమంగా తిరిగివచ్చారు. ఒక్కొక్క ప్యాడ్ దగ్గర 30, 40 మంది ఉగ్రవాదులు ఉండవచ్చని అంచనా. ఆ లెక్కన చంపిన ఉగ్రవాదుల సంఖ్య చాలా ఎక్కువే ఉండచ్చు. కానీ 40 లోపే నని ఇంతవరకు వార్తలు సూచించాయి. కచ్చితంగా తెలియడానికి సమయం పట్టచ్చు.  అర్థచంద్రాకృతిలో 250 కిలోమీటర్ల మేర సర్జికల్ దాడులు జరిపినట్టు సమాచారం. పదాతి సైనికులు,  హెలికాప్టర్ ను ఉపయోగించే పారా కమాండోలు ఈ దాడిలో పాల్గొన్నారు. చంపిన వాళ్ళలో ఏ ఒక్కరి మృతదేహాన్ని వదిలి పెట్టి రావద్దని ముందే వారికి ఆదేశాలిచ్చారు.

అన్ని సాక్ష్యాలనూ పకడ్బందీగా సిద్ధం చేయడం కోసం దాడులతో సహా అన్నింటినీ కెమెరాలో బంధించారు. ద్రోన్ లనుంచి కూడా ఫోటోలు తీసే ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఫుటేజ్ ను విడుదల చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

‘సర్జికల్’ కు సపోర్ట్ పెరుగుతోంది

  • అమెరికా సంఘీభావం
  • బంగ్లాదేశ్ సహా దేశాల మద్దతు
  • రేపటి గురించి శేషప్రశ్నలు

న్యూ ఢిల్లీ: గురువారం భారత సైనికులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి చొచ్చుకువెళ్లి  ఉగ్రవాదులకు చెందిన 7 లాంచింగ్ ప్యాడ్ లను ధ్వంసం చేసి 40 మందిని పైగా హతమార్చిన చర్య దేశప్రజలనే కాక, అంతర్జాతీయదృష్టిని కూడా ఆకర్షించింది. విదేశాంగ కార్యదర్శి  వివిధ దేశాలకు చెందిన దౌత్యాధికారులకు ఈ సర్జికల్ దాడుల గురించి సమాచారం అందించారు. బంగ్లాదేశ్ సహా ఆయా దేశాలు ఈ చర్యకు మద్దతు ప్రకటించాయి.

అమెరికా సైతం భారత్ భాగస్వామ్యంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తన నిబద్ధతను ప్రకటించింది. పీఓకేలో సర్జికల్ దాడులు జరిపినట్టు భారత్ ప్రకటించగానే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో యూ.ఎన్ లోని అమెరికా రాయబారి సుసాన్ రైస్ మాట్లాడినట్టు వెల్లడించింది. దాడులకు ముందే సుసాన్ రైస్ అజిత్ దోవల్ తో మాట్లాడి ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ తో అమెరికా భాగస్వామి అవుతుందని హామీ ఇవ్వడం గమనార్హం. తన దేశంలోని ఉగ్రవాద సంస్థలపై, వ్యక్తులపై చర్య తీసుకోవాలని ఆమె పాకిస్తాన్ కు  సూచించారు. ఉరీపై జరిగిన దాడి సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పెంచిందనీ లష్కర్ తోయిబా, జై షే మహమ్మద్, హకాని నెట్ వర్క్ లను ఉగ్రసంస్థలుగా ప్రకటించడం పై అమెరికా నిబద్ధమై ఉందని అమెరికా విదేశాంగ అధికారప్రతినిధి జాన్ కిర్బి అన్నారు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ ల మధ్య సంభాషణ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.  

ఉరీ దాడి అనంతరం ఒకవైపు అంతర్జాతీయంగా పాక్ ను దోషిగా నిలబెడుతూ పాక్ పట్ల తను తీసుకోబోయే చర్యలకు ఆయా దేశాల మద్దతును కూడగట్టుకుంటూ, ఇంకోవైపు పాక్ కళ్ళు కప్పుతూ అదను పదను చూసుకుంటూ భారత్ ఎంతో వ్యూహబద్ధంగా నేర్పుగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. శత్రు భూమికి చెందిన ఆనుపానులు కనిపెట్టడంలో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వృత్తిపరమైన మంచి నైపుణ్యాన్ని కనబరచడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా భారత సైన్యం సమర్థంగా వాడుకోగలిగింది. ముంబై దాడుల తర్వాత అన్ని వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్టు తాజా సర్జికల్ దాడులు నిరూపిస్తున్నాయని భద్రతా నిపుణులు అంటున్నారు. గురువారం నాటి దాడులు భారత్ ప్రతిదాడి సామర్థ్యాన్ని వెనకటి కన్నా ఉన్నత స్థాయిలో చూపిస్తూ భారత్ ను అంతర్జాతీయంగా సరికొత్తగా చూపిస్తున్నాయని అంటున్నారు.

అయితే, భారత్ వ్యవహరణ ముందు ముందు కూడా దీనికి దీటుగా ఉంటుందా, పాక్ ఎలాంటి ప్రతిచర్యకు పాల్పడుతుంది, దానికి భారత్ ఎలా జవాబు చెబుతుందన్న ప్రశ్నలూ వేలాడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

What Is Behind Pak Denial?

  • 38 terrorists killed
  • No Indian Casualties

New Delhi: The Pakistani army had accused India of ‘ fabricating the truth’ after India revealed that it had carried out surgical strike. Indian army spokesman said five terror launch pads were destroyed in the attack.

The strikes were launched last night based on ‘very specific and credible information that some terrorist units had positioned themselves to infiltrate’ Lt General Ranbir Singh, Director General of Military Operations told reporters on Thursday morning. But the Pakistani army press release said that two Pakistani soldiers were killed in an unprovoked firing by India across the LoC. ‘This quest by Indian establishment to create media hype by rebranding cross- border fire as surgical strikes is fabrication of truth’, the Pak army said in a statement.

Former senior diplomat Vivek Katju interpreted Pakistan stance as an attempt to defuse the situation. He expressed his view that more retaliation from Pakistan can be expected.

While Prime Minister Narendra Modi tried for peace for two years, Pakistan Prime Minister Nawaz Sharif had chosen to tow the army line. The Pak denial may also be construed that it does not want to escalate the situation in the ground. Army said Indian troops went three kilometres inside Pakistan and killed 38 terrorists. By the surgical strike India has sent a clear signal to the terrorists in Pakistan. 

Pakistan Prime Minister Nawaz Sharif condemned the attack and warned that their desire for peace should not be viewed as weakness.

The analysts insist that it was a very well planned and executed operation. The villagers along the borders in Punjab and Gujarat were evacuated to safer places. The fact that there were no Indian casualties goes to show that the operation was truly surgical.

Leave a Reply

Your email address will not be published.

శత్రుభూమిలోకి వెళ్ళి సత్తా చాటాం

  • అర్థరాత్రి ఆదాటుగా పీఓకేపై భారత సైనికుల దాడి
  • పెద్దసంఖ్యలో ఉగ్రవాదుల హతం
  • భారతసైన్యానికి సర్వత్రా అభినందన.

(ప్రైమ్ పోస్ట్ బ్యూరో)

న్యూ ఢిల్లీ: భారత సైన్యం అన్నంత పనీ చేసింది. “తాము కోరుకున్న చోట కోరుకున్న సమయంలో సైనికచర్య జరిపి” ఉరీలో  సాటి సైనికసోదరులను 18 మందిని పొట్టన పెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదఘాతుకంపై ప్రతీకారం తీర్చుకుంటామని సైన్యం ముందే ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి దాటాక చడీచప్పుడు కాకుండా, ముందుగా ఎటువంటి ఉప్పూ అందించకుండా పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాదుల లాంచింగ్ పాడ్ లపై దాడి చేసి విధ్వంసం సాగించింది. సర్జికల్ ఆపరేషన్ గా సైనిక పరిభాషలో చెబుతున్న ఈ చర్యలో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్టు, భారత సైన్యంలో ఒక్కరూ చనిపోనట్టు ప్రకటించింది.

ప్రోటోకాల్ ప్రకారం, సర్జికల్ దాడి గురించి భారత సైన్యం పాక్ సైనికాధికారులకు సమాచారం ఇచ్చింది.

భారతసైన్యం జరిపిన ఈ చర్యకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. మన జవానుల ధైర్యసాహసాలను, దక్షతను అందరూ ముక్తకంఠంతో అభినందిస్తున్నారు. ఈ వార్తతో ఖంగు తిన్న పాకిస్తాన్, ఈ దాడిని అబద్ధంగా చిత్రించి త్రోసిపుచ్చింది. సరిహద్దుల వద్ద రెండు వైపులా ఇలాంటి ఆపరేషన్లు సర్వసామాన్యమేననీ, కాకపోతే ఇది ఒకింత పెద్దది కావచ్చనీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.

అయితే, ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా వివరాలు వెంటనే అందలేదు. ఎంతమంది ఉగ్రవాదులు మరణించినదీ తెలియలేదు. సాయంత్రానికి సమాచారం అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇందులో పదాతి దళం మాత్రమే పాల్గొనగల అవకాశం ఉందనీ, శత్రుప్రాంతంలోకి చొచ్చుకు వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా వైమానిక దాడులు జరపడం తేలిక కాదని సైనిక నిపుణులు అంటున్నారు.

గురువారం ఉదయం ప్రధాని మోడీ సెక్యూరిటీ విషయాల క్యాబినెట్ కమిటీతో అత్యవసరంగా సమావేశమైనట్టు, మరికొంత సేపటిలో మీడియా సమావేశం ఉండబోతున్నట్టు తెలియడంతో పాకిస్తాన్ తో ఏర్పడిన తాజా ఉద్రిక్తత నేపథ్యంలో ఏదో కీలకమైన ప్రకటనో, లేక సమాచారమో వెల్లడవుతుందని ఊహించుకున్న జనం ఉత్కంఠతో ఎదురుచూశారు. కొద్ది సేపటిలోనే డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) జనరల్ రణబీర్ సింగ్, విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ మీడియా ముందుకు వచ్చారు. డీజీఎంవో సర్జికల్ ఆపరేషన్ జరిపి చెప్పుకోదగిన సంఖ్యలో టెర్రరిస్టులను మట్టుపెట్టినట్టు ప్రకటించారు. భారత్ లోకి పెద్ద ఎత్తున టెర్రరిస్టులు చొచ్చుకు వస్తున్నారనీ, భారత్ లోని ప్రధాన నగరాలతో సహా పలుచోట్ల దాడికి సన్నద్ధమవుతున్నారనీ సమాచారం అందడంతో ఈ చర్య తీసుకున్నామని, ఈ చర్య ఇంతటితో ముగిసిందనీ, మరో చర్యను చేపట్టబోమని వెల్లడించారు. పాక్ సైనికాధికారులకు కూడా ఈ చర్య గురించి సమాచారం ఇచ్చామని చెప్పారు.

సాయంత్రం ఆరు తర్వాత, అప్పటికి ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇస్తామని చెప్పి, ప్రశ్నలు వేయద్దని మీడియాను వారించి సమావేశం ముగించారు.

రక్షణ విషయాలలో సాధారణంగానే గోప్యత ఎక్కువ. అందులోనూ రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తత రీత్యా ఇలాంటి చర్యలలో గోప్యత పాటించడం సహజమే కాక, అర్థం చేసుకోదగినదే. ఉరీ దాడి జరిగినప్పటినుంచే ఈ దాడికి పూర్వ రంగాన్ని రచిస్తూ ఉండి ఉంటారనడంలో సందేహం లేదు. పాక్ కు తగిన గుణపాఠం చెప్పడానికి అన్ని అవకాశాలనూ పరిశీలిస్తూనే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంటూనే వచ్చాయి. పైకి మాత్రం దౌత్య, ఆర్థిక వగైరా మార్గాలలో వెడుతున్నట్టు ప్రభుత్వం అభిప్రాయం కలిగించింది. చివరికి కీలకప్రభావం చూపగలిగిన సర్జికల్ ఆపరేషన్ తో దేశాన్నే కాక, ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచి మోడీ ప్రభుత్వం వ్యూహ పరిణతిని చాటుకుందని అనవలసిఉంటుంది. పాక్ లో జరగనున్న సార్క్ సమావేశాల బహిష్కరణకు మరో మూడు సార్క్ దేశాల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా, అంతకుముందు యూ.ఎన్ లో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగం ద్వారా, సింధుజలాల ఒప్పందం అంశాన్ని ప్రచారంలో ఉంచడం ద్వారా మోడి ప్రభుత్వం ఈ చర్యకు తగిన వాతావరణాన్ని నేర్పుగా రచించిందని ఆనకతప్పదు.

సర్జికల్ ఆపరేషన్ అంత తేలిక కాదనీ, కష్టసాధ్యమనీ సైనిక నిపుణులు అంటున్నారు. ఎక్కడికక్కడ మందుపాతరలు, ఇతర ప్రమాదాలు పొంచి ఉండే శత్రు భూమిలోకి వెళ్ళి దాడి జరిపి ప్రాణనష్టం కలిగించి క్షేమంగా తిరిగిరావడంలో భారతసైన్యం ప్రదర్శించిన లాఘవాన్ని, దక్షతను, స్ఫూర్తిని సర్వత్రా అభినందిస్తున్నారు. ఇందుకు వారికి తోడ్పడిన ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ప్రశంసిస్తున్నారు.

 దీనికి పాకిస్తాన్ ప్రతిచర్య ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. సర్జికల్ దాడిని అబద్ధంగా పాక్ చిత్రించడం యుద్ధపరిస్థితిని పెంచడం ఇష్టం లేక కావచ్చనీ, అందుకు తను సిద్ధంగా లేకపోవడం వల్ల కావచ్చనీ విదేశాంగ నిపుణులు అంటున్నారు.

మొత్తం మీద ఉరీ నుంచీ వార్తలలో ఉంటూ వచ్చిన సర్జికల్ ఆపరేషన్ జరిగింది. ఇక నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏ రూపం తీసుకుంటుంది, ఏ మలుపు తీసుకుంటుందన్నది రోజు రోజుకీ తేట పడుతుంది.

Leave a Reply

Your email address will not be published.

What Indo-Pak nuclear war means?

  • The costs are prohibitive

New Delhi: Defence experts warn the political establishments that the costs of a nuclear war between India and Pakistan would be prohibitive. This was done in the backdrop of the warning issued by Pakistan government that any aggression by India would lead to nuclear war. Even in India, an armed option has been talked about and a BJP MP called for nuclear strike by India.

According to Abheet Singh Sethi‘s piece published by the Firstpost, if India and Pakistan fought a war detonating  100 nuclear warheads (about half of their combined arsenal), each equivalent to a 15-Kiloton Hiroshima bomb, more than 21 million people will be directly killed., about half the world’s protective ozone layer would be destroyed, and a !nuclear winter’ would cripple the monsoons and agriculture worldwide.

BJP Rajya Sabha Member Dr Subramanian Swamy said on 23 September 2016 that if 100 million Indians died in a Pakistani nuclear attack, India’s retaliation would wipe out Pakistan. But actual costs would be beyond India and Pakistan. Within the first week of the nuclear blast 21 million people, half of the casualties in World War-2, would be killed.

So far, Pakistan’s nuclear ability has been deterring India from retaliating the terror attacks from Pakistan. Pakistan’s Defence Minister. Khwaja M Asif had said the other day in response to threats of retaliation from India, ‘If Pakistan’s security is threatened, we will not hesitate in using tactical (nuclear) weapons’. The surgical strike undertaken by India must be a calculated risk.

Leave a Reply

Your email address will not be published.

Infantry did it: General Ranbir Singh

New Delhi: Director General Military Operation (DGMO) Lieutenant-General Ranbir Singh said on Thursday that Indian army conducted ‘surgical strikes on terror launch pads at the Line of Control.’ The action was carried out after a careful planning in wake of two ceasefire violations by Pakistani troops in less than 24 hours.

‘It has been a matter of great concern that there had been continuous infiltration across the line of Control in Jammu and Kashmir’, said General Ranbir Singh. Spokesperson of Ministry of External Affairs Vikas Swarup also participated in the media conference. The General said the continuous infiltration has reflected in the terrorist attacks in Poonch and Uri on 11 and 18 September respectively.

General Ranbir Singh said he had spoken to Pakistan DGMO and shared details of the attacks with him. ‘It is India’s intention to maintain peace and tranquility. The strikes were carried out across the Line Of Control by the Indian infantry. Two Pakistani soldiers were killed. He explained that the surgical operations lasted for four hours and destroyed five terror launching pads across LoC.

Prime Minister Narendra Modi will be speaking at All-Party Meeting at 4 pm on Thursday.

Leave a Reply

Your email address will not be published.

What are the possible options to repay Uri

(Primepost bureau)

New Delhi: The fearless attack on an army base in Uri has pushed India-Pakistan relations to the brinkthat are already under strain from a similar strike on an airbase in Pathankot earlier this year. Government is under tremendous pressure to respond robustly. The Pathankot raid offered hopes that the two sides might handle the fallout of such attacks in mature, constructive way. But the steady collapse in ties, marked by reciprocal sniping on Kashmir and Balochistan has soured the mood.

Continued Pakistani provocations on border, cross boarder infiltrations and terrorist activities in side India compelling Indian government to look for ways to inflict costs for their misdeeds. The general mood in public and political leadership is that the time has come to retaliate with full might.

In present scenario, what are the possible options available with India?

Diplomacy: Isolating Pakistan internationally to force it to retract terrorism as an instrument of state policy. India has pursued this line for decades without much success. Now that terrorism has emerged as a global threat, India has more diplomatic leverage and more support from terror effected countries. Convincing great powers in declaring Pakistan as a terrorist state and apply global sanctions. Abrogating Indus Water Treaty and boycotting SAARC summit in November can also be considered.

Aggressive posturing: Moving forces to the border in an aggressive deployment. Refuse Indian skies for Pakistani flights, scale down Pakistani mission in New Delhi and recall Indian high commissioner in Islamabad. Without interactions further deterioration in relations is possible. This move might help the NDA government on the domestic front but may not be of any help in the long run.

War of attrition: Escalate the offensive over Balochistan. Make Pakistan pay heavy price for its interference in Jammu and Kashmir and hope that it sees reason in stopping terror exports across the border. But this approach can backfire and strengthen anti-India elements among state and non-state actors in Pakistan.

Bilateral talks: Engage the civilian leadership in Pakistan. This, however, goes against New Delhi’s stated line that terror and talks can’t go together. Unfortunately, civilian leadership in Pakistan is not in a position to decide on matters related to India. Engage the Pakistani Army, which controls the levers of power, through back-channels. But their interest in peace is suspect.

Hot pursuit: Indian forces to go after the terrorists and neutralise them in Pakistani territory. This option was mooted against Pakistan-backed militants but never exercised. There are inherent risks involved in these operations as resistance from Pakistani forces responding to Indian Army and escalating it into full-fledged war.

Surgical Strike: A covert strike on terror training camps in Pakistan-occupied Kashmir (PoK) to damage them without collateral damage. Again this action by India might run the risk of a full-fledged war with Pakistan.

Leave a Reply

Your email address will not be published.

‘సైబర్ యుద్ధ’మే ప్రత్యామ్నాయమా?

  • ఉరీ దాడితో మిన్నంటిన ఆగ్రహం
  • పాక్ పై చర్యకు అవకాశాలు పరిమితం
  • వాగ్దానానికీ, ఆచరణకూ మధ్య మోడీ ప్రభుత్వం సతమతం

భాస్కరం కల్లూరి

ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడిచేసి పద్దెనిమిది మంది సైనికుల ప్రాణాలు తీసిన దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అది ఎంతైనా సహజం. 2001 నుంచీ తీసుకుంటే, ఆ ఏడాది భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు, అదే ఏడాదిలో కార్గిల్ యుద్ధమప్పుడు, 2002 లో 30 మంది సైనికులను బలిగొన్న కాలూచాక్ దాడి సందర్భంలో, 2008లో 170 మందిని కబళించిన ముంబై దాడి సందర్భంలో, ఈ ఏడాది జనవరిలో పఠాన్ కోటలో జరిగిన దాడి సందర్భంలో కూడా ఇలాగే జనంలో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ఈ పదిహేనేళ్ళ మధ్య కాలంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. పాకిస్తాన్, లేదా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జరిపిన ఈ దాడులు, లేదా యుద్ధాలపై ఎన్డీయే, యూపీయే ప్రభుత్వాల స్పందన ఒకేలా ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత-పాకిస్తాన్ శతృత్వాన్నీ చారిత్రక లేదా దేశవిభజన వారసత్వంగానే చూడగలవు. అదే ఎన్డీయే ప్రభుత్వాల విషయానికి వస్తే, పాకిస్తాన్ పట్ల శతృత్వం బీజేపీ సైద్ధాంతిక దృక్పథంతో గాఢంగా పెనవేసుకున్న అంశం.

పాకిస్తాన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు సైద్ధాంతిక నిర్బంధాలేవీ లేవు కనుక ఆయా పరిస్థితులు, పరిణామాలను బట్టి వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, ఒక్కోసారి నిదానంగా ఒక్కోసారి దూకుడుగా వ్యవహరించే వెసులుబాటు వాటికి ఉంటుంది. కానీ సైద్ధాంతిక నిర్బంధాలు ఉన్న బీజేపీ పరిస్థితి వేరు. అది పాకిస్తాన్ పై దెబ్బకు దెబ్బ తీయాలని భావిస్తుంది. ప్రతిపక్షంగా ఉన్నంతకాలం అలా ఉద్బోధించడంలో ఆ పార్టీకి ఎలాంటి సమస్యా ఎదురవలేదు. కానీ అధికారపక్షం కాగానే  కేవలం ఆ  ఒక్క వైఖరితోనే ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలుసుకోక తప్పలేదు. ఆ పార్టీని వెంటాడుతున్న ఒక వైరుధ్యం అది. పార్లమెంటుపై దాడి, కార్గిల్ యుద్ధ సందర్భంలో మొదటిసారి ఆ వైరుధ్యాన్ని ఎదుర్కొంది. అప్పుడూ పాకిస్తాన్ కు దాని పద్ధతిలోనే తగిన గుణపాఠం చెప్పాలన్న డిమాండ్ జనంలోంచి వచ్చింది. అది బీజేపీ సైద్ధాంతిక స్థితికి అనుకూలమే. కానీ అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం అప్పటి అంతర్జాతీయ స్థితిగతులను అనుసరించి వెనక్కి తగ్గి ఇతర మార్గాలు తొక్కవలసివచ్చింది.

అదే ముంబై దాడులప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మళ్ళీ తన సైద్ధాంతిక భూమికనుంచి వాటిపై స్పందించింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ముంబై దాడుల తర్వాత తీసుకున్న వైఖరి నుంచి కొంత పక్కకు తొలగి ప్రధాని ఈజిప్టులోని షెర్మల్ షేక్ లో పాక్ ప్రధానితో సమావేశమవడాన్ని తప్పు పట్టి ఎద్దేవా చేసింది. అదే తామైతే పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని 2014 ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేసింది. కానీ అధికారంలోకి రాగానే తిరిగి వెనకటి వైరుధ్యంలోనే చిక్కుకోవలసివచ్చింది. తనదైన ఒక ప్రత్యేక సైద్ధాంతిక వైఖరితోపాటు ఎన్నికల వాగ్దానం రీత్యా; పార్టీ, ఆర్.ఎస్.ఎస్. వంటి ఇతర భావసారూప్య వర్గాలు, వ్యక్తుల స్థాయిలో పాకిస్తాన్ తో  ‘సై అంటే సై’ అనే ధోరణిని అనుసరిస్తూనే ప్రభుత్వం స్థాయిలో అందుకు భిన్నంగా వ్యవహరించక తప్పడంలేదు. ఇది రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణించడం లాంటిది. గత రెండున్నర ఏళ్లలోనే ఈ వైరుధ్యానికి అనేక ఉదాహరణలు. బీజేపీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ పై కఠినంగా వ్యవహరిస్తుందని జనంలో బలంగా కలిగించిన భావనతో పాటు ఈ రెండున్నర ఏళ్లుగా సంఘ్ పరివార్ అజెండాను అనుసరించి దేశంలో సంభవించిన వివిధ ఘటనలు కూడా దేశంలో ఉద్రిక్త భరితమైన ఒక ప్రత్యేకవాతావరణాన్ని సృష్టించాయి. పాక్ కు గట్టి గుణపాఠం చెప్పి తీరాలన్న ఒక నినాదం నానాటికీ పదునెక్కడానికి ఈ వాతావరణం ఎంతో దోహదం చేస్తోంది. దానికితోడు, వెనకటి కన్నా ఎక్కువగా వ్యాప్తినీ, బలాన్నీ పెంచుకున్న ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఈ దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితంగా చేసి ఆవేశపు అంచులు దాటించడంలో పాత్ర పోషిస్తున్నాయి. ఆపైన పొరుగుదేశాలతో సంబంధాలు సహా మన విదేశాంగ విధానం రాజకీయ ఏకాభిప్రాయం నుంచి పక్కకు తొలిగి నానాటికీ రాజకీయ పాక్షికతను తెచ్చుకుంటూ ఉండడం కూడా దీనికి మరింత ఊతమిస్తోంది.    

టీవీ డిబేట్లలో కొందరు మాజీ సైనికాధికారులు పాక్ పై సైనికచర్య అవసరాన్ని మరింత నొక్కి చెప్పడం చూస్తున్నాం. రానున్న రెండున్నర ఏళ్లలో ఈ రణభేరీ ధ్వనులు  మరింత తారస్థాయికి చేరే అవకాశముంది.  ఒకవేళ వెనకటి ప్రభుత్వాలకు భిన్నంగా పాక్ కు తగిన బుద్ధి చెప్పి దాని దూకుడుకు అడ్డు కట్ట వేయలేకపోతే అది మరో సమస్య అవుతుంది. ఇంతకాలంగా చేస్తూ వచ్చిన పాక్ వ్యతిరేక యుద్ధారావాలు అసమర్థ ప్రతాపాలుగా పరిణమించి జనాగ్రహం ప్రభుత్వం వైపు మళ్ళుతుంది. ఈ పరిస్థితిలో పాక్ కు ఎలా బుద్ధి చెప్పగలుతాం, అందుకు ఎలాంటి అవకాశాలున్నాయన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

భద్రతా నిపుణుల అభిప్రాయాలను పరిశీలిస్తే, దురదృష్టవశాత్తు ఆ అవకాశాలు తగినన్ని లేవన్న భావన కలుగుతుంది. ఉదాహరణకు మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం. కె. నారాయణన్ అభిప్రాయాన్నే (ది హిందూ, సెప్టెంబర్ 21) చూద్దాం. కొందరు మాజీ సైనికాధికారుల వాదనను అనుసరించి మనం పాక్ పై సైనికర్యకు దిగితే అది నిర్ణాయకఫలితం ఇవ్వకపోగా ప్రతికూల ఫలితానికి దారితీస్తుందని ఆయన అంటున్నారు. ఎందుకంటే, పాకిస్తాన్ సైన్యం సరిగ్గా ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తోంది. అప్పుడు తనకు అనుకూలంగా చైనా లాంటి మిత్రదేశాలు కూడా రంగంలోకి అడుగుపెడతాయని, అప్పుడు కాశ్మీర్ తో సహా రెండుదేశాల ఘర్షణ అంతర్జాతీయ అంశంగా మారుతుందని పాకిస్తాన్ ఆశిస్తోంది. పోనీ  పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బతీయగలమా అనుకుంటే, ఎన్ని దేశాలు మన వెంట వస్తాయో చెప్పలేం. చైనా సహకరించే  అవకాశమైతే కచ్చితంగా లేదు. మిగతా ఆసియా దేశాలు కూడా రెండు దేశాల ఘర్షణలో తలదూర్చడానికి ఎంతవరకు ఇష్టపడతాయో సందేహమే. అదీగాక ప్రపంచ ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదుగుతున్న భారత్ ప్రతిష్టను ఇటువంటి చర్యలు పలచన చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో మనం పరిణతితో ఆచితూచి వ్యవహరించవలసిందే తప్ప పాకిస్తాన్ తో సమానంగా ఒక రోగ్ దేశంలా వ్యవహరించలేము. ఇంతవరకు ఈ పరిణతితో కూడిన మన స్పందన అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచిందనీ, నిజానికి పాకిస్తాన్ తో ‘భావనాత్మక యుద్ధం’(perception war)ద్వారా మనం ప్రపంచదేశాల మద్దతును, సానుభూతిని సంపాదించగలిగామనీ నారాయణన్ అంటారు.

పరిమిత సైనిక చర్య ఒక అవకాశంగా చర్చకు వస్తోంది. ఉరీ సైనిక శిబిరంపై తాజా దాడి సందర్భంలో సైన్యం ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముంబై దాడుల సందర్భంలోనూ ఈ సూచన వచ్చింది. అయితే, ఇలాంటి చర్య ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏవో కొన్ని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినంత మాత్రాన పాక్ బుద్ధి తెచ్చుకుంటుందా అన్న పెదవివిరుపూ వ్యక్తమవుతోంది. అదీగాక, ఎంటేబేలో ఇజ్రేలీ రక్షణ దళాలు, డెబ్బై దశకంలో మొగాడిషుపై జర్మన్ జి ఎస్ జి 9 దళాలు, 2011లో పాకిస్తాన్ అబొత్తాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించిన అమెరికా నావికా దళానికి చెందిన ఎస్ ఇ ఎ ఎల్ కు ఉన్నట్టు  ఇలాంటి దాడులు జరపగల సామర్థ్యం భారత్ కు ప్రస్తుతం లేకపోవడాన్ని నారాయణన్ ఎత్తిచూపుతున్నారు.  మన త్రివిధ దళాలకు స్పెషల్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ అవి బ్రిటన్, అమెరికా, జర్మనీ, రష్యాల కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ తో పోల్చదగినవి కావు. అవి సైన్యానికి అనుబంధంగా పనిచేయగలవు తప్ప స్వతంత్రంగా పనిచేయగలిగినవి కావు.

పాకిస్తాన్ తో ‘జలయుద్ధం’ మరో అవకాశం. మనం వారికి సింధు జలాల పంపిణీని ఆపవచ్చు. అయితే అందుకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిందను ఎదుర్కోవలసివస్తుంది. ఉన్నంతలో సైబర్ యుద్ధం (కంప్యూటర్ వ్యవస్థ లేదా నెట్ వర్క్ లను దెబ్బతీయడం)ద్వారా పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పడం ఒక అనుకూల అవకాశమనీ, ఇందులో మనకు చెప్పుకోదగిన సామర్థ్యం ఉందనీ నారాయణన్ అంటున్నారు. ఇలాంటివి ఏం చేసినా ప్రచార ఆర్భాటానికి దూరంగా చేయవలసినవి. కానీ, పాక్ వ్యతిరేక ఉద్ఘాటనలతో అదే పనిగా హోరెత్తిస్తూ జనంలో ఆవేశ కావేషాలతోపాటు ఆశలను రేకెత్తించడం మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. తగిన పరిణతితో స్పందించవలసిన అవసరం ఈ ఉధృతిలో ఎటో కొట్టుకుపోతోంది. చివరికి ప్రభుత్వం ఇప్పుడు ద్విముఖ పోరాటం చేయవలసిన పరిస్థితిలో కూరుకుపోయింది: ఒకటి, పాకిస్తాన్ తో; రెండోది, పాకిస్తాన్ పట్ల తను కఠినంగా వ్యహరిస్తానని జనానికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ప్రశ్నతో!

Leave a Reply

Your email address will not be published.

Army deployed in four worst hit districts

SRINAGAR: Indian Army deployed in rural areas of South Kashmir troubled districts of Pulwama, Shopian, Kulgam and Anatanag after a gap of two years.

Army Chief General Dalbir Singh Suhag visited Srinagar and other areas to review the internal security situation in the state on Friday. He has asked the jawans to be vigilant and extend all possible help to the administration in bringing back normalcy to the region.

What is noticeable is the fact that both the central and state governments have unanimously decided to redeploy troops in rural areas.

General Suhag also visited the LOC and units in North and South Kashmir.

Violent protests erupted after the killing of the Hizbul militant Burhan Wani by the Indian security forces on July 8, administration is trying to regain order that have left thousands of people and security personnel wounded.

Also at Panaji, Defence Minister Manohar Parrikar said the increased deployment of troops was for anti-terror activities as the “army does not act in internal matters unless asked by the local authority”.

“The local civil administration will have to ask (for) the army there like it happened in Haryana, where the (Jat) agitation took place. When the local administration called the army in, we went there only then and followed the orders of the local administration. We don’t operate anywhere internally on our own,” Parrikar said.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.