రజినికి భద్రత పెంపు

చెన్నై: కావేరీ జలాల విషయంలో చెలరేగిన వివాదం. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చింది. కర్ణాటక, తమిళనాడు ఇరు రాష్ట్రాల్లోనూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. టీఎన్ అనే రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కనిపిస్తే చాలు, కర్ణాటకలో తగలబెడుతున్నారు. అటు తమిళనాడులో కూడా కన్నడ హోటళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో పలువురు నటులకు పోలీసులు భద్రత పెంచారు.

ప్రస్తుతం కర్ణాటక – తమిళనాడు రాష్ట్రాల్లో కావేరీ జలాల వివాదం తారా స్థాయిలో హింసాత్మకంగా మారింది. కర్ణాటకలో ఉన్న తమిళుల ఆస్తులను, తమిళనాడులో ఉన్న కన్నడిగుల ఆస్తులను నిరసనకారులు తగులబెడుతూ విధ్వంసాలకు పాల్పడుతున్నారు.

 ఈ నేపథ్యంలో కొంతమంది నటులపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ముందు జాగ్రత్త చర్యగా రజనీకాంత్, ప్రభుదేవా, రమేష్ అరవింద్, బాబీసింహాలకు పోలీసులు రక్షణ కల్పించారు. వీరిలో రజనీకాంత్ నిజానికి మహారాష్ట్రలో జన్మించారు. కర్ణాటకలో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు.  అదే విధంగా ప్రభుదేవా జన్మించింది కర్ణాటకలో అయినా తెలుగు, తమిళ సినిమాలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందాడు. అలాగే రమేష్ అరవింద్, బాబీ సింహాలకు కూడా కన్నడ సినిమాలలో చేసిన నేపథ్యం ఉంది. దాంతో వీరిపై దాడులు జరగకుండా చూసేందుకు పోలీసులు భద్రత పెంచారు.

ఈ విధ్వంసానికి సంబంధించి మరో నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో స్పందించారు. `మన హక్కుల కోసం మనం పోరాడాలి, న్యాయం సాదించాలి. న్యాయ పోరటమంటే విధ్వంస పూరితంగా వుండకూడదని` ట్విట్టర్ లో సందేశం ఇచ్చాడు ప్రకాశ్‌ రాజ్ . అంతేకాక  ఉద్యమం ఎలా చేయాలో మన భవిష్యత్ తరాలకు మనమే నేర్పించాలన్నాడు. మనకు కోర్టులున్నాయ్, నాయకులున్నారు, చట్టముంది. మనమంతా మనుషులం. శాంతియుతంగా పోరాడుదాం అంటూ తన అభిప్రాయాన్ని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. శాంతిగా ఉండండి, విధ్వసం ఆపండి, విధ్వంసానికి పాల్పడవద్దని అంటూ నిరసనకారులకు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశాడు.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.