కొర్రపాటి సాయి కార్యాలయంపై ఐటి దాడులు

సినిమా రంగంలో అంచలంచెలుగా ఎదిగిన ప్రముఖ సినీ నిర్మాత సాయి కొర్రపాటి ఆఫీస్‌పై ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మణికొండలోని వారాహి చలనచిత్రం ఆఫీస్‌పై ఐటీ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. ఆదాయానికి సంబంధించిన పన్నులు సరిగా చెల్లించడం లేదని సాయి కొర్రపాటి మీద ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అక్రమ ఆస్తులు లభించలేదని సమాచారం.

వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలు పెట్టి ఫైనాన్సర్ గా, నిర్మాతగా అంచలంచెలు ఎదుగుతూ వచ్చాడు.ఇండస్ట్రీ తీరు తెన్నుల గురించి పూర్తిగా తెలుసుకొని ఇందులోకి వచ్చినట్టుగా సాయి చెబుతుంటాడు. ఆచితూచి సినిమాలు నిర్మాణం చేసే సాయి, కొద్ది కాలంలోనే వారాహికి మంచిపేరు సంపాదించాడు.

వారాహి చలన చిత్రం బ్యానర్ లో సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా బాగుటుందనీ, ప్రేక్షకులను బాగా అలరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించుకోగలిగారు. అందాల రాక్షసి సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతలుగా మారి ఇండస్ట్రీలో తమ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఈగ, లెజెండ్ లాంటి పెద్ద సినిమాలకు కో ప్రొడ్యూసర్స్ గా వుంటూ ఊహలు గుసగుసలాడే, మనమంత, జ్యోఅచ్యుతానంద వంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి మంచి నిర్మాతగా సాయి కొర్రపాటి సెక్సెస్ అయ్యాడు.

సాయి కొర్రపాటికి సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా వున్నాయని అంటారు. అయితే సినిమాల్లో లాభాలు గడిస్తున్నా ఇన్ కమ్ టాక్స్ మాత్రం చెల్లింపులు చేయడంలేదని అధికారుల ఆరోపణ. దీంతో ఐటి అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి వారాహి ఆఫీస్ లో సోదాలు చేసారు. కొన్ని గంటలపాటు సోదాలు నిర్వహించిన తరువాత వారాహి పై వచ్చిన ఆరోపణలు తప్పని తేల్చి చెప్పారు అధికారులు. సోదాలు నిర్వహించడానికి సాయి కొర్రపాటి పూర్తిగా సహకరించారని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.