గౌతమ్ కు పడిపోయింది

గౌతమ్ మీనన్ సినిమాలు చాలా కూల్ గా రిచ్ గా వుంటాయి. ఆయన సినిమాల్లో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తాడు. సాంప్రదాయిక దుస్తులకు ప్రాధాన్యం ఇస్తూ హోమ్లీ లుక్ ఇస్తాడు. ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మెహన్ కూడా సాంప్రదాయిక దుస్తులతో అందరినీ ఆకట్టుకుంది. తనను సూపర్బ్ గా చూపించి లైఫ్ ఇచ్చిన గౌతమ్ తో సంబంధం కొనసాగిస్తానని మంజిమా మెహన్ అంటోంది.

గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే అమ్మాయిల కెరీర్ కు అది మంచి హెల్ప్ అవుతుంది. కొత్త అమ్మాయికి ఆయన సినిమాలో ఛాన్స్ దొరికిందంటే ఇక ఆమె ఇండస్ట్రీలో సెటిల్ అయినట్టే. మంజిమా మెహన్ కి అప్పుడే మంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇందులో గౌతం తనను చూపించిన తీరుకు మంజిమా ఫిదా అయిందట.

ఇప్పుడు తను గౌతమ్ మీనన్ కు పెద్ద ఫ్యాన్ గా మారిందనీ, మాటి మాటికీ గౌతమ్ నామస్మరణ చేస్తోందనీ అంటున్నారు. అతనంటే తనకు ఇష్టమని మంజిమా మెహన్ పలు సందర్భాల్లో బాహాటంగానే చెప్పింది. ఈ బ్యూటీ గౌతమ్ తో రేలేషన్ లో ఉన్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే పుకార్లు వినిపిస్తున్నాయి. మరిన్ని అవకాశాల కోసం మంజిమాను గౌతమ్ పెద్ద డైరక్టర్లకు పరిచయం చేస్తున్నాడట కూడా.

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది.ఈ మూవీలో నాగచైతన్య హీరోగా నటించాడు.

Leave a Reply

Your email address will not be published.