అమ్మవారి పాత్రలో రాణించిన నటీమణులు

పండగల్లో విశిష్టమైంది దసరా. ఇది సరదా పండగ మాత్రమే కాదు… ఆ ఆదిశక్తి జగన్మాత పూజలందుకునే పవిత్రమైన పండగ. దసరా పర్వదినాల్లో  ఆ ఆదిశక్తి నవదుర్గగా వివిధ అలంకారాల్లో, అవతారాల్లో దర్శనమిస్తుంది. దుర్గామాత శక్తి అపారం. ఆమె మహిమలు ఎన్నో. అమ్మవారి గురించి ఎన్నో సినిమాలు  వచ్చాయి. కొందరు నటీమణులు అమ్మవారి పాత్ర ధరించి అచ్చం ఆ ఆదిశక్తిని తలపింపజేశారు. విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారిపై  ఈ ప్రత్యేక కథనం…

తెలుగు సినిమాల్లో వ్యాపార విలువలతో పాటు సంప్రదాయం, ఆచార వ్యవహారాలూ ఉన్నాయి. తెలుగువారి పండగల్లో ప్రతి పండగకూ ఒక విశిష్టత ఉంది. అందుకు తగ్గట్టుగానే మనకు సినిమాలూ వచ్చాయి. దసరా ఆ ఆదిశక్తి పండగ. జగన్మాతను కొలిచే ఆ పండగ గురించీ, దుర్గామాత గురించీ గతంలోనూ, ఇటీవల చాలా సినిమాలే వచ్చాయి. కొందరు నటీమణులు అమ్మవారి పాత్రల్లో అద్భుతంగా నటించారు.

గతంలో కనకదుర్గ పూజా మహిమ,,, కదలివచ్చిన కనకదుర్గ, జగన్మాత, సప్తపది, కంచి కామాక్షి , అమ్మోరు వంటి సినిమాలు వచ్చాయి. ఈమధ్య కాలంలో అష్టలక్ష్మీ వైభవం, పరాశక్తి మహిమలు, శ్రీదేవి కామాక్షి, శ్రీశక్తి మహిమలు, దేవీ మహత్యం వంటివి వచ్చాయి.

దేవతల పాత్రలు వేయాలంటే అందరికీ సాధ్యం కాదు. అందుకు తగ్గ ఆహార్యం, నియమ నిష్టలు ఉండాలి. ముఖంలో భక్తి భావం, ఆధ్యాత్మికత తొణికిసలాడాలి.  తెలుగు సినిమాల్లో జగన్మాతగా వేసిన  మొదటి నటి కెఆర్ విజయ. ఆమెను చూసినవారు ఆ ఆదిశక్తే దిగివచ్చిందా అనుకున్నారు. ఆ తర్వాత భానుప్రియ, ఆ తర్వాత రమ్యకృష్ణ అమ్మవారి పాత్ర వేసి రాణించారు. ఆమధ్య వచ్చిన సప్తపది లో నటి సబితకూడా దుర్గాదేవి పాత్ర వేసింది. ఇప్పటివారిలో  కాళికాదేవి పాత్ర వేసిన వారు లేరనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.