తెలుగులో మళ్ళీ ఛాన్స్ ఇవ్వరూ!

టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయినా  ఒకప్పుడు  ఫుల్ గా లైమ్ లైట్ లో ఉన్న హీరోయిన్స్  సడన్ గా ఫేడవుట్ అవుతుంటారు. ప్రత్యేకించి దీనికి ఇదీ రీజన్ అని చెప్పలేం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ట్రై చేసి ఫ్లాప్ అయిన వాళ్లూ ఉన్నారు. బెల్లీ బ్యూటీ గాళ్ ఇలియానా కూడా ఇప్పుడు  టాలీవుడ్ లో  రీ ఎంట్రీ కోసం ట్రయల్స్ వేస్తోంది.

ఒకప్పుడు ఇలియానా  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. మహేష్ బాబుతో  ఇల్లీ బేబీ చేసిన పోకిరి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో  ఒక్కసారిగా నంబర్ వన్ పొజిషన్ లోకొచ్చేసింది. యూత్ కి హాట్ ఫేవరేట్ అయిపోయింది. ఇక ఇలియానాకు తిరుగులేదనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే  వరస హిట్స్ కూడా వచ్చాయి. సీనియర్ హీరోలతో, యంగ్ హీరోలతో  మూవీస్ చేసి లక్కీ గాళ్ గా మారింది.

ఒకానొక స్టేజ్ లో ఇలియానా ఉంటే పిక్చర్ సక్సెస్ అనే పేరు సంపాదించుకుంది. హీరోలు కూడా  తమ మూవీస్ కి ఇల్లీని తీసుకునేవారు. కానీ సడెన్ గా ఫేట్ మారింది. మూవీ ఛాన్సులు దూరమయ్యాయి. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి టాలీవుడ్ ను నిర్లక్ష్యం చేయడమే  అందుకు కారణమని కొందరంటారు.

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా  తన హవా నడిపిన ఇలియానా బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ అంతగా సక్సెస్ రాలేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్‌తో చేసిన ‘రుస్తుం’ మూవీ హిట్ అయినా ఇలియానాకి ఆఫర్లు రావడం లేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి నేను ఆఫర్ల కోసం ఎవరినీ అడగను అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

బాలీవుడ్ లో ఫెయిలైన ఇలియానా .. తను మూవీ ఛాన్సులకోసం ఎవరినీ అడగను అని డాంబికాలు పలికినా మళ్లీ టాలీవుడ్ కి రావడానికి ట్రయల్స్ వేస్తోంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో టచ్ లో ఉందట. బట్ .. .. కొత్తభామల ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ఇప్పుడు ఇలియానాకు ఎవరైనా హీరోయిన్ గా ఛాన్సిస్తారా అనే డౌట్ కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published.