హ్యాండ్సమ్ హీరోల జాబితాలో హృతిక్

హాలీవుడ్ హీరోలకే అవార్డులు, రివార్డులు వస్తాయని, రికార్డులన్నీ వాళ్లవే అని ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇతర దేశాల సెలెబ్రిటీలకూ  గుర్తింపు లభిస్తోంది. ఫోర్బ్స్ వంటి పత్రికలు విదేశీ ప్రముఖుల్ని కూడా గుర్తిస్తున్నాయి. టాప్ టెన్ లోనూ, వంద మంది ప్రపంచ ప్రముఖుల్లోనూ మనకూ ప్లేస్ మెంట్ ఉంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లేటెస్ట్ గా ఓ రికార్డ్ సాధించాడు.

ఒకప్పుడు హీరోలు అందంగా ఉన్నా లేకపోయినా హీరోలుగా రాణించారు. జనరేషన్స్ మారేకొద్దీ గ్లామర్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ లెక్కన చూస్తే ఇండియాలో మోస్ట్ హ్యాండ్సమ్ సినీ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకడనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. గతంలో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో సర్వేల్లో ఇది రుజువైంది.

లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రపంచంలోని అందమైన హీరోల జాబితాలో హృతిక్ కు మూడో స్థానం దక్కడం విశేషం. చాలామంది హాలీవుడ్ హీరోల్ని వెనక్కి నెట్టి హృతిక్ ఈ స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ‘మిషన్ ఇంపాజిబుల్’ హీరో టామ్ క్రూయిజ్  నంబర్ వన్ గా, ట్విలైట్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ నంబర్ టూగా నిలిచారు.

మరో ఇండియన్ హీరో కూడా టాప్ టెన్ లో స్థానం సంపాదించుకున్నాడు.  కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏడో స్థానం సాధించాడు. ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’ హీరో జానీ డెప్ నాలుగో స్థానం,  బ్రాడ్ పిట్ కు  ఎనిమిదో స్థానం దక్కాయి. ‘ఎక్స్ మెన్’ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న జాక్ మన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

ఆన్ లైన్ పోల్ ద్వారా ఈ జాబితాను రూపొందించారు.  ఎంతోమంది హాలీవుడ్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నా.. .. వాళ్లను వెనక్కి నెట్టి టాప్-10లో మన హీరోలు ఇద్దరు చోటు దక్కించుకోవడం గొప్ప విశేషమనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.