సినిమాలు పాడై పోయాయి

“సినిమాలకు నీతి, నియమం, పద్దతి పాడు లేకుండా పోయాయి. పూర్తిగా విలువలను కోల్పోయిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. విదేశీ పోకడలతో సినిమాలు టూమచ్ గా తయారయ్యాయి…” అలా నాటి మేటి నటి జయా బచ్చన్  బాహాటంగా అన్నమాటలివి. సినిమా ఇండస్ట్రీ గురించి ఆమె అన్నమాటలు ఎవరినైనా ఆలోచింపజేసేలానే ఉన్నాయి.

సినిమాల్లో మానవీయ విలువలు లేకుండా పోయాయని జయా బచ్చన్ వాపోయారు. మామి వేడుకలో పాల్గొన్న ఆమె ప్రస్తుతం సినిమాలో విదేశీయత పెరిగిపోయి, భారతీయ విలువలు తగ్గిపోయాయని అన్నారు. స్క్రీన్ మొత్తం మీద హీరోయిన్ భారతీయ సంప్రదాయం లో కనపడే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.

ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్- మామి  18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మ రణార్థం నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తు తరాలు అయోమయంలో పడటం ఖాయమని అన్నారు.

మసాన్, అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు.విలువలతో కూడుకున్న సినిమాలను జనం మొదటినుండి ఆదరిస్తునే వున్నారని జయ తెలిపారు. కొత్త దనం పేరుతో విలువలు కోల్పోయే సినిమాలు తీయడం అంత మంచిది కాదని హితవు పలికారు. జయాబచ్చన్ మాటలు నూటికి నూరుపాళ్ళు సత్యాలని సినిమా పెద్దలు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.