పెట్టుడు మీసంతో ఇబ్బందే

తమిళ హీరో కార్తీ నటించిన కాష్మోరా చిత్రం విడుదల కాగా, నిన్నటి వరకు ఈ హీరో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొన్నటి మొన్న హైదరాబాద్‌లోను సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు. అయితే ఈ ప్రెస్‌మీట్‌లో కార్తీకు ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ హీరో కార్తీ. తాజాగా ఊపిరి  స్ట్రెయిట్ సినిమా ద్వారా కూడా మరింత దగ్గరయ్యాడు. అతను నటించిన కాష్మోరా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌ నిర్వహించాడు కార్తీ.

ఉత్తరాది హీరోలైతే మీసాలు ఉంచుకోరు. కానీ దక్షిణాదిలో, అదికూడా తెలుగులో అయితే హీరోయిజానికి మీసం కూడా ఒక ప్రధాన అంశం అవుతుంది.  హైదరాబాద్ వస్తున్నాను కదా అని కార్తీ ఒక పెట్టుడు మీసం పెట్టుకుని వచ్చాడు. మైకు పట్టుకుని సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు.

ఉన్నట్టుండి ఎడమవైపు మీసం కొంచెం కిందకు జారింది. కార్తీ దానిని గమనించుకోలేదు. కాసేపు ఆగిన తర్వాత మరికొంత ఊడి, ఇంకా కిందకు జారింది. నోటికి అడ్డం రావడంతో ఆ విషయాన్ని గుర్తించిన కార్తీ, దాన్ని సరిచేసుకుని, ప్రెస్‌మీట్ కొనసాగించాడు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న కాట్రు వెలీదాలో కార్తీ మీసం, గడ్డం లేకుండా కనిపిస్తాడు. దాంతో కొన్నాళ్ళుగా ఇదే గెటప్‌లో కార్తీ కనిపిస్తున్నాడు. ఏదేమైనా పుట్టుడు మీసం లేకపోతే హీరో ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ ఘటనతో అర్ధమైంది.

Leave a Reply

Your email address will not be published.