రొమాన్స్ లో రెచ్చిపోతున్న ప్రియాంక

సినిమాల్లో శృంగారం మితిమీరిపోతోంది. హాలీవుడ్ మూవీస్ లో అయితే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మన తారలు కూడా రొమాన్స్ లో వాళ్లకు ఏం తీసిపోవడంలేదు. ఇంకా కాస్త డోస్ పెంచే యాక్ట్ చేస్తున్నారు. సినిమా వేషాలకోసం మొదట్లో కొందరు ఏ రకంగానైనా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కానీ బాగా పేరున్న హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాల్ని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈమధ్య మరీ ఓవర్ యాక్షన్ చేస్తోంది.

నిన్న మొన్నటివరకూ హాట్ భామలుగా సన్నీలియోన్ ని, పూనం పాండేని చెప్పుకునేవారు.  ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా వాళ్లకేం తీసిపోవడంలేదు. ఎంత సెక్సీగా చేసేందుకైనా రెడీగా ఉంది. హాలివుడ్ లో అవకాశం వచ్చిన తర్వాత ప్రియాంక రూట్ మార్చేసింది. బాలీవుడ్ లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో ఎంత తెగించి అయినా చేయవచ్చు.

క్వాంటికో టీవీ సిరీస్ లో అందాలు ఒలకబోస్తూ యాక్ట్ చేసిన ప్రియాంక చోప్రాను చూసి అక్కడి వాళ్లు స్టన్ అయ్యారు. తన అందచందాలతో వాళ్లను కట్టిపడేసింది. దాంతో హాలీవుడ్ లో ప్రియాంకకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్ లో విచ్చలవిడిగా నటించవలసి వస్తుందని, అందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పింది ప్రియాంక.

పిగ్గీ చాప్స్ అని ప్రియాంక ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు.  తనను అభిమానించే వారికి అందాలు చూపిస్తే తప్పేంటని కూడా అంటోంది ప్రియాంక. ఆమె నటించిన హాట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ హాట్ గా సర్క్యులేట్ అవుఉన్నాయి. ఒక బాలీవుడ్ నటి ఇంతగా తెగించి చేస్తుందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రియాంకకు హాలీవుడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రియాంక యాక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ త్వరలో రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published.