అదిరేటి లుక్స్ తో హీరోలు

అదిరేటి లుక్స్ మేమిస్తే దడ…మీకు దడ…అని గాళ్స్ బాయిస్ ను చూసి పాడుతుంటారు. ఇంక సినిమాల్లో అయితే హీరోయిన్ వంపులూ, వయ్యారాల సోయగాలు, అందాల ఆరబోతలూ చెప్పక్కర్లేదు. బట్ … లేటెస్ట్ గా సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలే కాదు…అబ్బాయిలు కూడా అదిరేటి లుక్స్ ఇస్తూ కిక్ ఇస్తున్నారు.  టాలీవుడ్ హీరోల సంగతే తీసుకుంటే … స్టైల్స్ లో హీరోయిన్స్ ని ఓవర్ టేక్ చేస్తున్నారు.

నలుగురు  ఫ్రెండ్స్ లో ఎవరైనా ఏ హీరో స్టైల్ నైనా ఇమిటేట్ చేస్తుంటే…ఫోజులు కొట్టకురా అని అంటున్నారు. అంటే హీరోల స్టైల్స్ అంత పాపులర్ అన్న మాట. డ్రెస్ లో, హెయిర్ స్టైల్ లో, గడ్డం గెటప్ లో, స్మైల్ లో, లుక్ లో టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ కంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నారు. వాళ్ల  స్టైల్స్ కి అందరూ పడిపోతున్నారు.  కొంతకాలంగా అదిరే కిక్ లే ఇస్తున్నారు.

అదివరకైతే ఏ హీరో అయినా వరసగా కొన్ని పిక్చర్స్ వరకూ ఒకే  స్టైల్ మెయిన్ టెయిన్ చేసేవాడు. ఇప్పుడు  టైం ఛేంజ్ అయింది.  ట్రెండ్ మారింది. డ్రెస్ ల మాదిరిగానే హీరోలు ఒక్కో పిక్చర్ కూ ఒక్కో స్టైల్ తో కనబడుతున్నారు. పైగా ఏదైనా సినిమాలో ఒక స్పెషల్ కేరక్టర్ చేసేటప్పుడు … ఆ పాత్రకోసం గడ్డం పెంచుకోవడం, సిక్స్ ప్యాక్ బాడీని బిల్డప్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు.

ఇక కొన్ని సినిమాల్లో హీరోలు బాగా జుట్టు పెంచుకొని, క్లిప్ పెట్టుకుని కనిపిస్తారు. ఇదివరకు విలన్ లు ఆ టైప్ లో కనిపిస్తే కొంతకాలంగా  హీరోలు కూడా అదే గెటప్ లో దర్శనమిస్తున్నారు.  హీరోయిన్స్ మాదిరిగానే హీరోలు కూడా డిఫరెంట్  హెయిర్ స్టైల్స్ లో కనబడుతున్నారు. ఇక చిరు గడ్డంతో కనిపించడం నేటి యంగ్ హీరోలకు మామూలైపోయింది.

Leave a Reply

Your email address will not be published.