ఐటం సాంగా.. అయితే ఓకే

హీరోయిన్స్ ఐటం సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఐటం సాంగ్ చేయడానికి మొదట్లో కాస్త బెట్టు చేసినా, తర్వాత ముందుకొచ్చేస్తున్నారు. హీరోయిన్స్ మధ్య కాంపిటీషన్ పెరగడంతో రేసులో తామెక్కడ మిస్ అవుతామో అని ఐటం సాంగ్ కైనా సిద్ధపడుతున్నారు. ఆ ఐటం సాంగ్ అయినా దక్కించుకుందామని కొందరు హీరోయిన్స్ తెగ ట్రై చేస్తున్నారు. హీరోయిన్  ఛాన్స్ కోసం ఎదురు చూడకుండా ఏదోక అవకాశం వస్తే చాలనుకుంటున్నారు. 

ఈ మధ్య చాలా సినిమాల్లో ఐటం సాంగ్ పెడుతున్నారు. కలెక్షన్స్  పెరగడానికి ఐటం సాంగ్ పనికొస్తోంది. అందులోనూ వేరే డాన్సర్ల చేత ఐటం పెట్టే బదులు హీరోయిన్ రేంజ్ లో ఉన్నవారి చేత ఆ పాట చేయిస్తే ఆడియన్స్ కు కన్నుల పండగే. ఈ వీక్ నెస్  తెలుసుకున్న మూవీ మేకర్స్ ఆ పనే చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్స్ ని తీసుకుంటున్నారు. వారిలో ఒకరిని అసలు హీరోయిన్ గా తీసుకుంటే, మరొకరిని ఐటం సాంగ్ కు తీసుకుంటున్నారు.

ఈ ఎరేంజ్ మెంట్ హీరోయిన్స్ కు కూడా లాభసాటి బేరంగా మారింది. హీరోయిన్ గా చేస్తే సినిమా పూర్తయ్యేదాకా పనిచేయాలి. ఐటంకు ఆ సమస్య లేదు. ఒకటి రెండు రోజులు చేసి వెళ్లిపోవచ్చు. పైగా రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ముడుతుంది. ఒక పాటకు పది నుంచి పాతిక లక్షలు కూడా తీసుకుంటున్నారు. ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వాళ్లు కూడా హీరోయిన్ గా మాత్రమే చేస్తాను అని గిరిగీసుకోకుండా ఐటం సాంగ్ కూడా చేస్తానంటున్నారు.

గుంటూర్ టాకీస్ మూవీలో హీరోయిన్ గా వేసిన టీవీ యాంకర్ రేష్మీ గౌతమ్ రెచ్చిపోయి నటించింది. ఆ మూవీ సక్సెస్ అయినా రష్మీకి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. అందుకే  ఇప్పుడు పెద్ద సినిమాలపై కన్నేసింది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడానికి రెడీ అట. చిన్న కేరక్టర్, ఓ పాట, లేదా ఐటం సాంగ్ మాత్రమే అయినా ఫరవాలేదట.  స్టార్ హీరోయిన్లు శ్రియ, సమంత, ఛార్మి, కాజల్, తమన్నా, అంజలి వంటివారు ఐటమ్స్ చేస్తున్నారు.

ఇప్పటి సినిమాల్లో ఐటంకు ఫుల్ డిమాండ్ ఉంది. స్టార్ హీరోయిన్సే కాక లక్ష్మీరాయ్, హంసా నందిని వంటివారు కూడా ఈ సాంగ్స్ చేస్తున్నారు.  నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఐటం సాంగ్ కు కూడా హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published.