గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలకు భారీ సన్నాహాలు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన భారీ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా క్రిష్ వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే  రిలీజైన ఫస్టులుక్ కి, టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో  థియేట్రికల్ ట్రైలర్ ను రీలీజ్  చేసేందుకు  క్రిష్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ని గ్రాండ్‌గా చేసే సన్నాహాల్లో ఉంది చిత్ర యూనిట్‌ .

నటసింహ నందమూరి బాలకృష్ణ, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కాగా, ఇది తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతుంది.

అందరి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ రాగా,  థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి భారీ ఎత్తున్న స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుదల‌య్యేలా ప్లాన్ చేస్తున్నట్టు క్రిష్ పేర్కొన్నాడు.

డిసెంబ‌ర్ మొద‌టివారంలో గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నట్టు క్రిష్‌ తెలిపారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  శ్రేయ, హేమమాలిని, కబీర్ బేడి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తున్నాడు సంక్రాంతి కానుకగా జనవరి12, 2017న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.