దేనికైనా సై అంటున్న జెనీలియా

పెళ్లికి ముందు హాట్ గా నటించిన కొందరు హీరోయిన్స్ మ్యారేజ్ తర్వాత గుట్టుగా ఫ్యామిలీ లైఫ్ కి అంకితమవుతున్నారు.  కొందరు మళ్లీ మూవీస్ లోకి ఎంటరవుతున్నారు. అలాంటివారు రీ ఎంట్రీ ఇచ్చినా ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటున్నారు. కానీ…పెళ్లికి ముందు  అందాలు ఆరబోసిన జెనీలియా మాత్రం తను ఇప్పుడు కూడా ఎక్స్ పోజింగ్ కు రెడీ అనే అంటోంది, హాట్ గా యాక్ట్ చేస్తుందట.

జెనీలియా ఒకప్పుడు తన గ్లామర్ తో కుర్రకారుకి నిద్రలేని రాత్రులిచ్చింది.  పెళ్లయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ మూవీల్లోకి వస్తోంది. జెనీలియా మంచి నటి. గ్లామర్ కేరక్టర్సే కాక, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలూ వేసింది. ఆమె పిక్చర్స్ హిట్ అయ్యాయి కూడా. పెళ్లయ్యాక కూడా జెన్నీ ఏం మారలేదు.  అదివరకు ఎలా యాక్ట్ చేశానో ఇప్పుడూ అలాగే చేస్తానంటోంది.

ఇప్పుడు మళ్లీ తెరపై కనిపించాలనుకుంటున్న జెన్నీ  ఇంకాస్త ఎక్కువ ఎక్స్ పోజింగ్ కు కూడా రెడీ అంటోంది. సినిమాను బట్టి, గతంలో చేసిన ఎక్స్ పోజింగ్ కంటే ఎక్స్ పోజింగ్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుందట. చాలా గ్యాప్ తర్వాత మూవీస్ కు వస్తున్న జెనీలియా తమిళ నటుడు జీవి ప్రకాష్‌ సినిమాలో చేయబోతోంది.  అతనితో చేసే సీన్స్ హాట్ గా, ఘాటుగా ఉంటాయట, ముద్దు సీన్లు బాగానే ఉంటాయట. పైగా ఆ సీన్స్ లో చేసేందుకు తనకు ఆబ్జెక్షన్ కూడా లేదని నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. జీవీ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి కాబట్టి తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తానంటోంది జెనీలియా. అలాగే బాలీవుడ్ పిక్చర్స్ కూడా చేయాలని ఉందట.

Leave a Reply

Your email address will not be published.