విలన్ గా గౌతం

గౌతం మీనన్ ని ఇప్పటి వరకు డైరెక్టర్ గానే చూసారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. సౌత్ ఇండియన్ సినిమాలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి వుంది. యూత్ ని థీయేటర్లకు రప్పించడంలో గౌతమ్ మీనన్ ఎక్స్ పర్ట్. ఇదంతా బాగానే వుంది కాని ఇప్పుడు గౌతమ్ డైరెక్టర్ గా నే కాకుండా మరో కోణంలో తన టాలెంట్ ని చూపించబోతున్నాడు. గౌతం మీనన్ తీసుకున్న ఆ నిర్ణయం కోలీవుడ్ ఇండస్ట్రీకి షాకింగ్ మారింది.

సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చి, అనుకోని కారణాలవల్ల, అంది వచ్చిన అవకాశాన్ని కాదనలేక, నటులుగా, హీరోలుగా అయిన వారిని మనం చూసాం. రవితేజా, నాని లాంటి వారు ఆ కోవకు చెందినవారే. అయితే వీరంతా బాగానే సెటిల్ అయ్యారు. కాగా డైరెక్టర్ గా ఆల్ రెడీ స్థిరపడిన తరువాత నటులుగా అయినవారు చాలా అరుదు. ఒకవేళ నటించినా ఏదో గెస్ట్ రోల్స్ కి పరిమితం అయ్యేవారు. అయితే గౌతం మీనన్ మాత్రం ఏకంగా విలన్ గానే నటించబోతున్నాడు.

తమిళ్ లో ఎస్ జే సూర్యా లాంటి డైరెక్టర్ కూడా నటుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నించాడు. అయినా వర్క్వ అవుట్ అవ్వలేదు. తరువాత డైరెక్షన్ వైపు టర్న్ అవుదామని ట్రై చేసినా ఏదోక సినిమాలో నటుడిగా ఆఫర్స్ రావడంతో డైరెక్షన్ పై పూర్తి దృష్టి పెట్టడంలేదు. ఒక సారి తెరమీదకనపడాలనే ఆలోచన బలంగా పడితే తెరవెనుక పని చేయడం కష్టమని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది.

ప్రస్తుతం గౌతం మీనన్ కూడా ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కనున్నఓ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ఇందులో నయనతార హీరోయిన్. ఈ సినిమా స్క్రిప్ట్ తనకి బాగా నచ్ఛటంతో దర్శకుడి కోరికకు వెంటనే గౌతమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ బిజీ వలన గౌతం మీనన్ తను డైరెక్ట్ చేసే సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నాడని అంటున్నారు.

గౌతం మీనన్ కి నటించాలనే ఆలోచన వుందని తెలిసిన కొదరు కోలీవుడ్ డైరెక్టర్లు తమసినిమాల్లో కూడా నటించాలని ఆఫర్ చేస్తున్నారట. దీంతో గౌతమ్ అటు కాదనలేక ఇటు తన ప్రాజెక్ట్ లు పెండింగ్ పెట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తుంది. మరి గౌతం మీనన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలిమరి.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.