పెళ్లి పనుల్లో సాయికుమార్ బిజీ

టాలీవుడ్ సెలెబ్రెటీలకు గాలి జనార్దన్ రెడ్డి విందు ఏర్పాటు చేయనున్నాడు. తన కూతురు వివాహం సందర్భంగా గాలి ఈ డిన్నర్ ఇవ్వనున్నాడు. టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు పంపే పనిలో నిమగ్నమై వున్నాడు నటుడు సాయికుమార్. గాలి ఇంట పెళ్ళిలో సాయి కుమార్ డైరెక్షన్ కీలకంగా మారింది. పూర్తి పనులు సాయికుమారే చూసుకుంటూ ఉండడం విశేషం.

భారత దేశంలో అత్యంత ఖరీదైన వివాహాల్లో గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహం ఒకటి. రెండు వందల కోట్లరూపాయలతో ఈ వివాహ వేడుకను జరపబోతున్నాడు గాలి. కాగా ఇటీవల వెడ్డింగ్ కార్డులు పంచేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన, ముందుగా టాలీవుడ్ ప్రముఖులందరికీ గ్రాండ్ గా స్పెషల్ డిన్నర్ పార్టీ ఇవ్వదలిచాడట. గాలి స్నేహితుడు, నటుడు సాయి కుమార్ ఆయన తరఫున వారినందరినీ ఆహ్వానించే బాధ్యత వహించబోతున్నాడు.

’సాయికుమార్ కి గాలి 2003 నుండి స్నేహితుడట. అందుకే గాలి ఇంటి పెళ్ళిలో సాయికుమార్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇప్పటికే సాయికుమార్ కర్నాటకలోని జనార్దన్ రెడ్డి నివాసానికి మకాం మార్చాడని అంటున్నారు. తానిప్పటికే చాలామంది తెలుగు సినీ దిగ్గజాలను ఇన్వైట్ చేశానని ఈ డైలాగ్ కింగ్ తెలిపాడు.

టాలీవుడ్ ప్రముఖులకు డిన్నర్ పార్టీ జరిగే తేదీని, వెన్యూను త్వరలో తెలియజేస్తానని సాయి కుమార్ తెలిపాడు. అటు-టాలీవుడ్ స్టార్స్ కొందరు ఈ వివాహ సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ చేయవచ్చునని, అయితే ఐటీ దాడుల భయంతో వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.