వరస సినిమాలతో బిజీ బిజీ

టాలీవుడ్ టాప్ హీరోలు స్పీడ్ పెంచారు.కొంతకాలం కిందటి దాకా నెమ్మదిగా ఏడాదికి ఒక సినిమా చేసే మన హీరోలు ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఈ జనరేషన్ హీరోలతో పాటు సీనియర్ కథానాయకులు కూడా చకచకా సినిమాలు చేసేస్తున్నారు. వరసగా లైన్ లో వెంట వెంటనే సినిమాలు చేసేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కు పండగే పండగ.

కొన్నేళ్ల కిందటిదాకా స్టార్ హీరోలకు ఎక్కువ సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదు. ఏడాదికో, రెండేళ్లకో ఒక పిక్చర్ చేసేవారు. అందువల్ల కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ అంతగా ఉండదు. ఈ పాయింట్ అర్థమైందో ఏమో కానీ… ఇప్పుడు హీరోలు ఎక్కువ సినిమాలు చేసే జోష్ లో ఉన్నారు. హీరోగా సినిమాలో ఎంత స్పీడ్ గా ఫైటింగ్స్, డాన్సులు చేస్తున్నారో అంత స్పీడ్ గా మూవీస్ నంబర్ ను పెంచుకోవాలనుకుంటున్నారు.

సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్  చకచకా సినిమాలు చేస్తున్నారు. పైగా ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకోసం స్టోరీ డిస్కస్ చేయడం, షూటింగ్ ప్లాన్ చేయడం కూడా చేసేస్తున్నారు. కొందరు కొద్ది గ్యాప్ కూడా తీసుకుంటున్నారు. లెజెండ్ బాలకృష్ణ  ఇప్పుడు చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రైతు సినిమాలో నటించవచ్చట. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఖైదీ 150 తర్వాత మరో రెండు పిక్చర్స్ కు ప్లాన్ చేశాడు.

ఇక నాగార్జున ఓం నమో వేంకటేశాయ షూటింగ్ పూర్తి కాగానే మరో సినిమా చేయవచ్చని టాక్. అలాగే విక్టరీ వెంకటేష్ సాలా ఖద్దూస్ మూవీ రీమేక్ గురు లో నటిస్తున్నాడు. ఇక ఈ జనరేషన్ కు వస్తే రామ్ చరణ్  ఒకవైపు ధ్రువ లో చేస్తూనే విజయదశమికి మరో సినిమా ముహూర్తం పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ బాహుబలిలో లీనమైన ప్రభాస్ అది పూర్తయిన వెంటనే మరో సినిమాకు కమిటయ్యాడు.

మహేష్ బాబు కూడా ప్రస్తుతం తను చేస్తున్న మురుగదాస్ మూవీ కంప్లీట్ కాగానే మరో పిక్చర్ చేస్తాడట.  జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు.  ఇక నాని, నారా రోహిత్ అయితే సినిమాల రిలీజ్ లతో పనిలేకుండా  వరసగా మూవీస్ చేస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.