ఒకే రోజు 4 సినిమాలు

దసరా అంటే సరదా….సరదాల సరాగాలతో సందడి చేసే పండగ. ఇది సినిమాల పండగ కూడా అనొచ్చు. ఈసారి దసరాకు సినీవినోదాల విరిజల్లు కురుస్తోంది. దసరా సందర్భంగా ఈ రోజు ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అవి ప్రేమమ్. అభినేత్రి, ఈడు గోల్డ్ ఎహె, మన ఊరి రామాయణం. ఈమధ్య … ఒకే రోజు నాలుగు సినిమాలు రాలేదు.

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ ఈ శుక్రవారం రిలీజైంది. ఇదే పేరుతో మలయాళంలో తీసిన మూవీకి ఇది రీమేక్. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను చందూ మొండేటి డైరెక్ట్ చేశాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. చైతూతో పాటు శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్స్ వేశారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు అక్టోబర్ నెల కలిసొచ్చింది కనుక నాగచైతన్య కూడా ఈ సినిమాపై మంచి హోప్స్ పెట్టుకున్నాడు.

సునీల్ హీరోగా నటించిన సినిమా ఈడు గోల్డ్ ఎహె. పిక్చర్ పేరు మనం మాట్లాడుకునే స్టైల్ లో క్యాచీగా పెట్టారు. వీరు పోట్ల రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా పక్కా రొమాంటిక్ కామెడీ. సునీల్ కు జోడీగా రీచా పనాయ్, సుష్మారాజ్  యాక్ట్ చేశారు. నరేష్, పునీత్ ఇస్సార్, పృథ్వీరాజ్, వెన్నెల కిశోర్ సపోర్టింగ్ కేరక్టర్స్ లో వేశారు.  ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర శ్రీకాంత్ నిర్మించారు.

ఈ దసరాకు వచ్చిన మరో సినిమా అభినేత్రి. ప్రభుదేవా, తమన్నా, అమీ జాక్సన్, సోనూ సూద్  లీడ్ రోల్స్ వేశారు. ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో  రొమాంటిక్, హారర్ థ్రిల్లర్  జోనర్ లో ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తీశారు.  ఎఎల్ విజయ్ డైరెక్టర్. ఎంవివి సత్యనారాయణ నిర్మాత. తమిళంలో దేవి పేరుతో ఈ మూవీ రిలీజైంది. అభినేత్రిగా తమన్నా నటనకు మార్కులు వస్తాయని టాక్.

ప్రకాష్‌ రాజ్ డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా … మన ఊరి రామాయణం. షట్టర్ పేరుతో మలయాళంలో వచ్చిన సినిమాకు ఇది రీమేక్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను తక్కువ ఖర్చుతో, లిమిటెడ్ లొకేషన్స్ లో తీశారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా…పృథ్వీరాజ్, రఘుబాబు సపోర్టింగ్ కేరక్టర్స్ వేశారు.

Leave a Reply

Your email address will not be published.