తనయుడి కోసం తండ్రి ప్లాన్

మరో వారసుడు వచ్చేస్తున్నాడు. ఈ సీజన్ అంతా వారసుల రాకతోనే సందడిగా మారింది. తండ్రులు ఫాంలో వుండగానే వారసులను ఇండస్ట్రీలో సెటిల్ చేయాలనే తాపత్రయం కనపడుతుంది. సినిమా పరిశ్రమ అంటేనే వారసత్వ సంపదగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది వారసులు ఎంట్రీలు జరిగిపోగా మరో స్టార్ హీరో కొడుకు కూడా వెండితెరకు పరిచయం అవడానికి సిద్ధంగా వున్నాడు.

ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, సూపర్ స్టార్ ఇలా టాలీవుడ్ లో చాలామంది తమ వారసులను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి సక్సస్ అయ్యారు. మన దగ్గరే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ లలో కూడా అదే తీరు. తండ్రుల క్రేజ్ తగ్గక ముందే తనయుల సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. అందులో కొందరు విజయం సాధిస్తే మరికొందరు అపజయం పాలవుతున్నారు.

టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సమకాలీకుడైన మోహన్ లాల్ తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసి వున్నాడు. రీసెంట్ గా మోహన్ లాల్ జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు మోహన్ లాల్ కేవలం మళయాల స్టార్ మాత్రమే కాకుండా సౌత్ స్టార్ గా ఎదిగిన తన కుమారుడిని తీసుకురావడం పెద్ద స్కెచ్ గా చెబుతున్నారు.

ప్రణవ్ మోహన్ లాల్ ఎంట్రీతోనే సౌత్ లోని అన్ని పరిశ్రమలలో ఈజీగా పరిచయం కావడానికి కావలసిన ప్లాట్ ఫామ్ ను మోహన్ లాల్ ఏర్పాటు చేసాడు. కెరీర్ అంతా కేవలం మళయాళ చిత్రాలకే పరిమితం అవకుండా సౌత్ లోని అన్ని భాషల్లో ప్రణవ్ ను హీరోగా తీసుకురావాలని మోహన్ లాల్ ప్లాన్ చేసాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రణవ్ మోహన్ లాల్ మళయాలంలోనే కాదు టాలీవుడ్ లోనూ పెద్ద హీరో అయ్యే అవకాశం వుందని సినీ పెద్దలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.